Moviesమోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీపై ట్రెండీ టాక్‌... కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలే...!

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీపై ట్రెండీ టాక్‌… కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలే…!

నందమూరి నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగ్రేటం విషయం గత నాలుగైదు సంవత్సరాలుగా టాలీవుడ్ లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తోంది. ఇప్పటికే కొణిదెల – అక్కినేని – దగ్గుబాటి ఫ్యామిలీలకు చెందిన వారసులు టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. దగ్గుబాటి అక్కినేని ఫ్యామిలీల నుంచి ఏకంగా మూడోతరం నట వారసులు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా మూడో తరం హీరోలు కొనసాగుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ ఉన్నా ఇటు సీనియర్ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్ష‌జ్ఞ‌ కూడా ఎప్పుడు సినీ అరంగ్రేటం చేస్తారా ? అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

బాలయ్య కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి తన తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా సరైన క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైంలోనే మోక్షజ్ఞ వశిష్టి పుత్ర పులోమావి పాత్రతో ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బాలయ్య 108వ సినిమా కూడా నడుస్తోంది. మధ్యలో నాలుగైదు సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా మోక్షజ్ఞ ఇప్పటికీ వెండితెర ఎంట్రీ ఇవ్వలేదు.

మధ్యలో మోక్షజ్ఞ లుక్ చూసినవారు కూడా షాక్ అయ్యారు. మోక్షజ్ఞ చాలా లావుగా.. బొద్దుగా ఉండడంతో అసలు మనోడికి సినిమాల్లో చేయటం ఇంట్రెస్ట్ ఉందా ? అన్న సందేహాలు కూడా బయటకు వచ్చాయి. అయితే బాలయ్య క్లారిటీ ఇచ్చి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని చెప్పడంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీకి సంబంధించి ముహూర్తం దాదాపు సిద్ధమైనట్టే తెలుస్తోంది. 2023 సమ్మర్ కానుకగా మోక్షజ్ఞ తొలి సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని అంటున్నారు.

 

 

ప్రస్తుతం అతడు తన శరీరాకృతిని తీర్చిదిద్దుకునేందుకు జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాడు. గతంతో పోలిస్తే తాజాగా బయటకు వచ్చిన లుక్‌ చూస్తే బరువు చాలా వరకు తగ్గినట్టే అనిపిస్తోంది. తాజాగా మోక్షజ్ఞ హైదరాబాదులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనయుడు భరత్‌తో కలిసి ఫోటో దిగాడు. నోవాటెల్లో జరిగిన ఈ ఫంక్షన్ లో మోక్షజ్ఞ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫీనిక్స్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి సురేష్ పుట్టినరోజు వేడుకలకు మోక్షజ్ఞ హాజరయ్యారు. ఈ ఫంక్షన్ లో మోక్షజ్ఞ పెద్దలను ప్రతి ఒక్కరిని పలకరించాడని… చాలా డీసెంట్ పర్సనాలిటీ అని.. తన తండ్రి బాలయ్య లాగే పెద్దలను గౌరవించే సంస్కృతి కలిగిన వ్యక్తి అని తాజాగా టాక్ బయటకు వచ్చింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news