నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన బింబిసార సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యిది. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఫస్ట్ టైం రాజులు, టైం ట్రావెల్ కథాంశంతో వస్తోన్న సినిమా కావడంతో పాటు ప్రి రిలీజ్ బజ్ బాగా రావడంతో ట్రేడ్ వర్గాలు, సినీ లవర్స్‌లో బింబిసార ఆసక్తి క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం.. బింబిసార ఖచ్చితంగా మిమ్మలను నిరాశ పరచదు అని కాన్ఫిడెంట్‌గా చెప్పడం.. కళ్యాణ్‌రామ్ కూడా గత సినిమాలకు భిన్నంగా ఈ సారి హిట్ కొట్టి తీరుతున్నా అని చెప్పడంతో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా బాగానే జరిగాయి.
ఈ రోజు రిలీజ్ అయిన బింబిసారకు అదిరిపోయే టాక్ వస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బింబిసార కథా పరంగా చూస్తే త్రిగర్తల రాజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్‌రామ్ చాలా బాగా ఎఫర్ట్ పెట్టి నటించాడని చెపుతున్నారు.
ఖచ్చితంగా ఇది తెలుగు ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించే సినిమా అని.. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో దిమ్మతిరిగి పోయిందని చెపుతున్నారు. ఇక సెకండాఫ్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంటుందట. కళ్యాణ్‌రామ్ యాక్టింగ్ అదిరిపోయిందనే అంటున్నారు. ఇక కీరవాణి మ్యూజిక్, విజువల్స్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయని ఎక్కువ మంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఓవరాల్‌గా సినిమాపై మిక్స్ డ్ టాక్, నెగిటివ్ టాక్ లేనే లేదు. హిట్ టాక్ వచ్చేసింది. ఇక కళ్యాణ్‌రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ర్యాంప్ ఆడుతోంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
Good First Half 👌 Interval 🔥🔥@NANDAMURIKALYAN 👌👌
Bgm Excellent 🤙🤙#Bimbisara . https://t.co/TWJFMJKn7J pic.twitter.com/pt3uc0Vhdm— #DADA 🙏 #NTR 💗 (@Dada_NTR) August 5, 2022