Moviesనంద‌మూరి హీరోల క్రేజ్ మామూలుగా లేదే... ఇండ‌స్ట్రీ దుమ్ము దులిపేశారు..!

నంద‌మూరి హీరోల క్రేజ్ మామూలుగా లేదే… ఇండ‌స్ట్రీ దుమ్ము దులిపేశారు..!

కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుడు ఓటీటీలకు అలవాటు పడిపోయాడు. దీంతో ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పులు వచ్చేసాయి. ఓటీటీలు చాలా తక్కువ ధరకే మంచి కంటెంట్ ఇస్తుండడంతో ఎక్కువమంది ఇల్లు దాటి బయటకు రావడం లేదు. థియేటర్లలో ఎంతో గొప్ప సినిమా అయితే తప్ప చూసేందుకు ఆసక్తి చూపటం లేదు. ఇక టాలీవుడ్ లో టిక్కెట్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మల్టీప్లెక్స్ లలో విపరీతమైన దోపిడీ కొనసాగుతుంది.

ఇలాంటి పరిస్థితులలో నందమూరి హీరోలు తమ సినిమాలతో టాలీవుడ్ కి సరికొత్త ఆశా కిరణాలుగా మారారు. నాని లాంటి హీరోలు మంచి కథా బలం ఉన్న సినిమాలు చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడలేదు. రామ్‌ లాంటి హీరోలు మంచి మాస్ మసాలా సినిమా చేసినా తిరస్కరించారు. అంతెందుకు చిరు, చెర్రీ క‌లిసి న‌టిస్తేనే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు. అయితే సరికొత్త కథా బలంతో ఉన్న సినిమాలు వస్తే మాత్రం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు.

కరోనా రెండో తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా ? రారా అన్న భయాన్ని పటాపంచలు చేస్తూ బాలయ్య అఖండ బాక్సాఫీస్ దగ్గర విజృంభించింది. అఖండలో బాలయ్య నట విశ్వరూపంతో టాలీవుడ్‌కు సరికొత్త ఊపిరి లూదాడు. అఖండ నిజంగా థియేటర్లకు పెద్ద బ్రీతింగ్ ఇచ్చింది. అఖండ సినిమా సాధించిన అఖండ విజయం చూసే ధైర్యంగా పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు తమ సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేశారు.

అఖండ తర్వాత కరోనా మూడో ద‌శ కూడా విజృంభించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఏకంగా రు. 1200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్‌కు కెరీర్ పరంగా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా సాధించిన విజయంతో ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే వ‌రుస‌గా చేస్తున్నాడు. ఇక తాజాగా మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

గత రెండు నెలలుగా టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నా చెప్పుకునేందుకు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. జూలై నెలలో అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా తన్నేసాయి. జూన్ నెలలో వచ్చిన విక్రమ్ – మేజర్ సినిమాలు మినహా మరే సినిమా థియేటర్లలో పట్టుమని పది రోజులు కూడా ఆడటం లేదు. ఇలాంటి టైంలో సోషియో ఫాంట‌సీ, చారిత్రాత్మక కథాంశంతో వచ్చిన బింబిసారా తొలి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇప్పుడు నందమూరి హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలు, ఇటు థియేటర్ల‌ వాళ్లకు పెద్ద ఆశకిరణాలుగా కనిపిస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలోనూ మిగిలిన ఫ్యామిలీల హీరోల‌పై పై చేయి సాధించారన్న చర్చలు నడుస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news