స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాలుగో కుమార్తె ఉమా మహేశ్వరి సోమవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే ఆమె సూసైడ్ చేసుకున్నారు. మొదట అందరు ఆరోగ్యం బాగోలేక మరణించారు అనుకున్నా..ఆ తరువాత అసలు విషయం బయటపడింది. ఆమె తన నివాసంలో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాని ఆమె కూతురు కన్ ఫామ్ చేసింది. దీంతో నందమూరి అభిమానులు శోక శంద్రంలో మునిగిపోయారు.
ఉమామహేశ్వరి మరణ వార్త విని.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే బాలకృష్ణ, చంద్ర బాబు, అందరూ హుటాహుటిన ఆమె నివాస స్దలానికి చేరుకుని అక్కడి పనులను దగ్గరుండి చూసుకున్నారు. కేవలం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే కాదు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెకి నివాళులు అర్పించారు. కాగా, కొద్దిసేప్పటి క్రితమే ఆమె అంత్యక్రియలు పూర్తైయాయి.
ఉమామహేశ్వరి పెద్ద కుమార్తె విశాల కుటుంబం అమెరికా నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుని తల్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 9లో ఉన్న ఆమె ఇంటి నుంచి మొదలైన ఉమామహేశ్వరి అంతిమ యాత్ర ఫిల్మ్ నగర్ సమీపంలోని మహా ప్రస్థానం శ్మశాన వాటిక వరకూ కొనసాగింది.
సోదరి మరణంతో తీవ్ర దు:ఖంలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఆమె పాడె మోసిన దృశ్యం అభిమానులను కలిచివేస్తోంది. ఉమా మహేశ్వరికి ఆమె భర్త కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ నిప్పంటించారు. అంతిమ సంస్కారాలకు టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలక్రిష్ణ సహా కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఆమె మరణం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగిల్చింది.