Moviesఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు... సంచలన నిజాలు బయటపెట్టిన నాగార్జున హీరోయిన్...!

ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు… సంచలన నిజాలు బయటపెట్టిన నాగార్జున హీరోయిన్…!

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్లు ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ బాధితులం అంటూ మీడియా ముందు చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన హీరోయిన్స్ మాత్రం కాస్టింగ్ కౌచ్ పై నోరు మెదపరు. ఎక్కువగా ఆఫర్లు రాని హీరోయిన్లు మాత్రమే కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఒక భూతం అనే చెప్పాలి. ఒకప్పటి భామల నుంచి ఇప్పటి బ్యూటీల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో తాను కూడా ఉన్నానని హీరోయిన్ ఈషా కొప్పికర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈషా కొప్పికర్ నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ త‌ర్వాత వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన ప్రేమ‌తో రా సినిమాలో సైతం ఓ హీరోయిన్‌గా కాసేపు క‌నిపించింది. 90లలో ఇషా స్టార్ హీరోయిన్ గా రాణించి అభిమానులను సంపాదించుకున్నారు. ఇక 2009 లో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరవాత సినిమాలకు దూరం అయ్యింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన కేశవ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించి మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇషా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టింది. చదువుకునే రోజుల్లో పాకెట్ మని కోసం తాను మోడలింగ్ చేశానని ఇషా వెల్లడించింది.

అలా మొడ‌లింగ్‌లో ఉన్న‌ప్పుడే తనకు సినిమా ఆఫర్ లు రావడం మొదలయ్యింది అని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎక్ థా దిల్ థా ధ‌డ్కన్ అనే సినిమాలో ఛాన్స్ రాగా అందులో నటించానని పేర్కొంది. ఈ సినిమా తర్వాత ఓ నిర్మాత ఫోన్ చేసి ఒక అవకాశం ఉందని చెప్పారని… అయితే ముందుగా హీరోను కలవాలి అని కండిషన్ పెట్టాడని తెలిపింది. ఆ తరవాత తాను హీరోకు ఫోన్ చేయగా మీరు ఒంటరిగా రండి… మీతో ఎవరూ రావద్దు ఏకాంతంగా కలుద్దాం అంటూ పచ్చిగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది.

దాంతో వెంటనే తాను సదరు నిర్మాతల‌కు ఫోన్ చేసి నేను టాలెంట్ ను నమ్ముకుని వచ్చా అని చెప్పానని తెలిపింది. నా టాలెంట్ కు అవకాశాలు వస్తే చేస్తా లేదంటే లేదు అని చెప్పానని పేర్కొంది. ఆ తరవాత తనను ఆ ప్రాజెక్ట్ నుండి తీసివేశారు అని తెలిపింది. ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోయిన్లు అవ‌స‌రాలు, అవ‌కాశాల కోసం రాజీ ప‌డుతున్నార‌ని కూడా చెప్పింది. అయితే ఆ హీరో, నిర్మాతలు ఎవరు అన్నది మాత్రం ఇషా కొప్పికర్ బయటపెట్టలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news