Moviesపాపం..ఇష్టం లేకపోయిన ఆ పని చేస్తున్న నాగచైతన్య..!?

పాపం..ఇష్టం లేకపోయిన ఆ పని చేస్తున్న నాగచైతన్య..!?

యస్.. ఇదే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ బడా హీరో సన్ నాగ చైతన్య..కూడా ఇండస్ట్రీలో హీరో గా సినిమాలు చేస్తున్నాడు. జోష్ సినిమా తో హీరో గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చైతన్య..ఇప్పుడు బాలీవుడ్ సినిమా లు చేసే స్దాయికి ఎదిగిపోయాడు. జోష్ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న ఈ హీరో..ఆ తరువాత సెకండ్ సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఏమాయ చేసావే సినిమాతో తనలోని టాలెంట్ ను బయటపెట్టాడు ఈ హీరో.

ఇక ఆ తరువాత హిట్లు, ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా..వరుస సినిమాలకు కమిట్ అవుతూ..తనకంటూ ఓ సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు నాగ చైతన్య. వ్యక్తిగతంగా ఆయన జీవితం ఓడిదుడుకులలో ఉన్నా..సినిమా లను మాత్రం వదలటం లేదు. సామ్ తో డివర్స్ ప్రకటించిన..సామ్ తన పై పరోక్ష కామెంట్స్ చేస్తున్నా..ఆయన మాత్రం కూల్ గా సాఫీగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ఆయన కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు నాగ చైతన్య. అయితే, మొదట ఈ సినిమాను వద్దు అనుకున్నారట.నాగ చైతన్య చేతికి ఈ కధ వచ్చే టైంకే..ఆయనకు సామ్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఆ టైంలో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడట. కానీ, నాగార్జున నే దగ్గరుండి చైతన్య ను ఓప్పించి..ఈ సినిమాకి సైన్ చేయించాడట. మరి చూడాలి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎలాంటి విజయం అందుకుంటాడో..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news