మెగా బ్రదర్ నాగ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఓ సెన్ సేషన్ క్రియేట్ అవుతుంది. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీదనే చెప్పడం ఆయనకి అలవాటు ఈ విషయం ఇప్పటికే మనకు చాలా సంధర్భాలల్లో ప్రూవ్ చేసాడు. నటుడిగా ,ప్రోడ్యూసర్ గా, జడ్జీగా ..అలరించిన ఈయన ప్రజెంట్ పాలిటిక్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న ఈయన..ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటున్నాడు.
అడగాల్సిన నాలుగు మాటలు సోషల్ మీడియాలోనే అడిగేస్తూ..రచ్చ రచ్చ చేస్తున్నారు. ఓ వైపు జబర్ధస్త్ కమెడియన్లను ఆ షో నుండి తప్పించేది ఈయనే అనే ఓ రూమర్ కూడా నెట్టింట బలంగా హల్ చల్ చేస్తుంది. అంతేనా, నాగబాబు కొందరికి డబ్బులిచ్చి ఇలా చేయిస్తున్నారని కూడా మాటలు వినిపిస్తున్నాయి. దీంతో నాగ బాబు పేరు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ క్రమంలో నే తాజా గా ఆయన చేసిన పోస్ట్ నెట్టింట దుమ్ముదులిపేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈయన రీసెంట్ గా ఓ కాంట్రవర్షీయల్ పోస్ట్ చేసాడు. ” జనరల్ గా నేను ఎవ్వరిని వదులుకోను, అయినా కానీ వదులుకున్నాను అంటే.. వాడు పెద్ద ఎదవ అయ్యి ఉంటాడు. మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను… ఒకవేళ వదులుకున్నానంటే వాడంత ఎదవ ఎవడు ఉండడు… “అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రకారం.. నాగబాబు తన సన్నిహితుల్లో ఎవరికో గట్టిగా కౌంటర్ వేశాడు అని బాగా అర్ధమవుతుంది. మరీ ఆ పెద్ద వెధవ ఎవ్వరు అనేదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంతకి ఆ వెధవ ఎవరబ్బా..?
View this post on Instagram