చిరంజీవి కాదు కాదు.. “మెగాస్టార్ చిరంజీవి”. టాలీవుడ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ పేరుకు ఉన్న్ స్పెషాలిటీ గురించి.. ఈ పేరుకు ఉన్న పవర్ గురించి ..ఈ పేరుకు జనాలు ఇచ్చే మర్యాద, గౌరవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి.. తన సొంత టాలెంట్ తో.. తన సొంత కష్టంతో.. నార్మల్ హీరో నుండి చిరంజీవిగా,, మెగాస్టార్ చిరంజీవిగా.. తన కెరీర్ ని ఎలా పైకి తీసుకొచ్చాడో మనం చూసాం.
ఇండస్ట్రీలో చిరంజీవి అనేది ఒక పేరు కాదు ఓ గౌరవం.. ఓ ఆదర్శం.. ఎంతోమంది నేటి కాలం యంగ్ హీరోస్ కి మెగాస్టార్ చిరంజీవి ఆదర్శం. ఎంతో మంది స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని సినీ ఇండస్ట్రీలోకికు వచ్చారు. ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా వాళ్ళ సినిమా సక్సెస్ మీట్ లో పలు ఇంటర్వ్యూలో చెప్పకు రావడం మనం చూసాం. కాగా ఈరోజు ఆగస్టు 22 అనగా చిరంజీవి పుట్టినరోజు..అంటే మెగాస్టార్ అభిమానులకు పండగ రోజే. ఈ సందర్భంగా చిరంజీవి లైఫ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ తేదీ గురించి మనం మాట్లాడుకుందాం.
చిరంజీవికి తన పుట్టినరోజు కన్నా కూడా సెప్టెంబర్ 22 అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన కొణిదెల శివ శంకర వరప్రసాద్ నుండి చిరంజీవి గా మారిన రోజు ఇదే. అప్పటివరకు శివశంకర వరప్రసాద్ గా ఉన్న మెగాస్టార్ ఆ తర్వాత సెప్టెంబర్ 22న చిరంజీవి గా జనాల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22 నే రిలీజ్ అయింది. నిజానికి చిరంజీవి నటించిన ఫస్ట్ సినిమా అంటే “పునాది రాళ్లు”. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయినా కానీ.. ప్రాణం ఖరీదు సినిమానే త్వరగా రిలీజ్ అయింది.
ఈ కారణంగా ప్రాణం ఖరీదు సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి. అందుకే చిరంజీవికి పుట్టినరోజు తేదీ కన్నా కానీ సెప్టెంబర్ 22 అంటేనే చాలా ఇష్టమట. ఎందుకంటే ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయింది ఆ రోజే . 1978 సెప్టెంబర్ 22వ తేదీన ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ” ఇప్పటికీ ఆ రోజున మర్చిపోలేను” అంటూ చిరంజీవి పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ” నా ప్రాణం పోయినా కానీ ఆ రోజున నేను మర్చిపోలేను. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అదే” అంటూ ఎమోషనల్ కూడా అయ్యారు.