Moviesఆ టాప్ డైరెక్ట‌ర్ ముందే డ్రెస్ చించేసుకున్న మొమైత్ ఖాన్... అంద‌రూ...

ఆ టాప్ డైరెక్ట‌ర్ ముందే డ్రెస్ చించేసుకున్న మొమైత్ ఖాన్… అంద‌రూ షాక్‌…!

పూరి జగన్నాథ్ సినిమాలలో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అవుతుంటాయి. హీరో ఎలివేషన్ సాంగ్స్ మాత్రమే కాకుండా హీరోయిన్‌ని ఎస్టాబ్లిష్ చేసే మాస్ సాంగ్ అలాగే, హీరో – హీరోయిన్ మధ్యన వచ్చే రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో పూరి స్టైలే వేరు. ఇక ఆయన ఏ సినిమా తీసినా స్పేస్ ఉంటే మాంచి ముంబై బ్యూటీని తీసుకువచ్చి మాస్ ఆడియన్స్ కోసం అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టేస్తారు. ఆ సాంగ్స్ బాగా హిట్ అవుతుంటాయి. దీనికి ఉదాహరణ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పూరి రూపొందించిన పోకిరి సినిమా.

ఇలియానా హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ సినిమా 75 ఏళ్ళ సినీ రికార్డ్స్‌ని వసూళ్ల పరంగా బద్దలుకొట్టింది. ఈ సినిమాలో హైలెట్ అయింది మొమైత్ ఖాన్ హాట్ ఐటెం సాంగ్‌. ఆమె రొమాంటిక్ స్టెప్పులతో అలరించిన ఇప్పటింకికా నా వయసు నిండా పదహారే పాటలో మొమోత్ పరువాల విందు అదిరిపోయింది. వీలైనంత పొదుపుగా వేసుకున్న మొమైత్ డ్రస్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సినిమా కంటే ముందే పూరి సినిమాలో మొమైత్ ఖాన్ ఐటెం సాంగ్ చేసింది.

అదే పూరి తమ్ముడు హీరోగా పరిచయమవుతూ వచ్చిన 143. ఆంధ్రావాలా సినిమా డిజాస్టర్ తర్వాత కొంత సమయం తీసుకొని పూరి రూపొందించిన 143 మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారానే మొమైత్ ఖాన్ తెలుగు తెరకు పరిచయమైంది. అప్పటికే దాదాపు 1500 వరకు ఇంగ్లీష్ పాప్ సాంగ్స్ పాడింది మొమైత్. పాప్ సింగర్ అయిన తనని ఇండస్ట్రీకి తీసుకువచ్చిన పూరి ముందే కత్తెర తీసుకొని క్షణాల్లో డ్రస్ చించేసుకుంది.

143 మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌లో లాంగ్ స్కట్ వేసుకుంది మొమైత్. అది ఐటెం సాంగ్ అని తెలియడంతో ..నేరుగా పూరి దగ్గరికి వెళ్ళి నన్నెందుకు పిలిచారు అని అడిగింది. ఐటెం సాంగ్ కోసం అని చెప్పాడు పూరి. ఇలా అయితే ఎవడైనా చూస్తారా..? అంటూ కాస్ట్యూమర్ ని పిల్చి కత్తెర తెమ్మని ఆ కత్తెర తీసుకొని కింద నుంచి పైన తిడల భాగం వరకు అడ్డంగా రెండు వైపులా మొమైత్ డ్రస్ కట్ చేసుకుంది.

మొమైత్ అలా చేయ‌డంతో అప్పుడు పైన తొడల వరకు కనిపిస్తుంది. ఆమె చేసిన పనితో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా షాక్ అయిపోయార‌ట‌. అలానే సాంగ్‌లో కనిపించింది. ఇది చూసి పూరికి అయితే మ‌తిపోయినంత ప‌నైంద‌ట‌. సినిమాలో ఆ సాంగ్ బాగానే హైలెట్ అయింది. ఆ తర్వాత పోకిరి మొమైత్ కి బ్రేక్ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news