ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోయిన్‌కి కాస్త యాటిట్యూడ్ ఉందనిపిస్తే నిర్మొహమాటంగా ఆ హీరోయిన్‌ని పట్టించుకోరు. ఇప్పటికే, ఈ విషయం చాలామంది విషయంలో నిరూపితం అయింది. కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన కొందరు హీరోయిన్స్ నాలుగు హిట్స్ పడగానే అన్నీ రకాలుగా మేకర్స్‌కి ఆర్డర్స్ పాస్ చేసేవారు ఉంటారు. అంతేకాదు, తమకన్నా సీనియర్ హీరో వచ్చి ముందు సెట్స్‌లో ఉన్నా కూడా కారవాన్ నుంచి నింపాదిగా వచ్చి ఏదో చేశామంటే చేశాము అన్న విధంగా షూటింగ్‌లో పాల్గొని వెళ్ళి పోతుంటారు.
తాజాగా స్టార్ హీరోయిన్‌గా ఉన్న పూజా హెగ్డే నిర్మాత కూడా ప్రస్తుతం తన యాట్యిట్యూడ్‌తో నిర్మాతలను ఎంతలా ఇబ్బంది పెడుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో త్రిష కొన్ని సందర్భాలలో హీరోలను ఇబ్బంది పెట్టిందని ప్రచారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్టాలిన్ సినిమా సమయంలో త్రిష చిత్ర యూనిట్‌ను బాగా ఇబ్బంది పెట్టిందట. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – త్రిష జంటగా స్టాలిన్ సినిమా రూపొందింది. ఈ సినిమా సమయంలో త్రిషకి మంచి క్రేజ్ ఉంది.
ఇటు తెలుగులో అటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఆ క్రేజ్ కారణంగానే మేకర్స్ స్టాలిన్ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే, చిరంజీవి సెట్‌కి వచ్చి వేయిట్ చేస్తున్నా కూడా త్రిష సమయానికి సెట్స్‌కి రాకుండా విసిగించిందట. ఇలా ఒక్కసారి కాదు, చిరంజీవితో పాటు చిత్రబృందాన్ని కూడా చాలా సార్లు వేయిట్ చేయించిందట. ఒకటికి రెండుసార్లు దర్శకుడు చెప్పినా కూడా పెద్దగా పట్టించుకోకుండా తనకి నచ్చిన సమయానికే వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయట.
ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క శెట్టి ఎప్పుడూ ఇలా ఇబ్బంది పెట్టలేదని తనతో కంపేర్ చేసి త్రిషను తిట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ అనుభవం గుర్తుండే ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ స్థానంలో త్రిషను ముందు అనుకొని ఆ తర్వాత వద్దనుకున్నారట. త్రిష కన్‌ఫర్మ్ అనుకున్న తర్వాత ఈ డెసిషన్ తీసుకున్నారు. అందుకే, కాజల్‌ను హీరోయిన్‌గా ప్రకటించారు. లేదంటే త్రిష ఆచార్యలో కనిపించేది. ఇక కాజల్ గర్భం దాల్చడంతో ఆచార్య సినిమాలో నటించినా కూడా పూర్తి స్థాయిలో షూటింగ్ చేకపోవడం వల్ల మొత్తానికే కాజల్ లేకుండా సినిమాను ఎడిట్ చేశారు.