దుల్కర్ సల్మాన్..ఈ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. పేరుకి మలయాళీ స్టార్ హీరో సన్ అయినా..అక్కడ సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న..ఆయన గురించి తెలుగులో చాలా తక్కువ మందికే తెలుసు. ఈయన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కొడుకు అని చాలా తక్కువ మందికే తెలుసు. మహానటి సినిమా ద్వారా ఈయన తెలుగు తెరకు దగ్గరైయారు. ఆ సినిమాలో జెమిని గణేశన్ పాత్ర కు పూర్తి న్యాయం చేసాదు దుల్కర్ సల్మాన్.
తెర పై ఈయన నటించిన తీరు తెలుగు జనాలను కట్టిపడేసింది. అమ్మాడి అంటూ ఆయన పిలిచే పిలుపు కూడా కొత్తగా అనిపించింది. సినిమా హిట్ కి కీలక పాత్ర పోషించారు దుల్కర్ సల్మాన్. అయితే, ఈ సినిమా తరువాత డైరెక్ట్ తెలుగు సినిమా చెయలేదు. మలయాళంలో డబ్ అయిన సినిమాలో నటించారే కానీ..నేరుగా తెలుగు సినిమాలో నటించలేదు. చాలా కాలం తరువాత తెలుగు లో డైరెక్ట్ గా “సీతా రామం” సినిమా ద్వార ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సక్సెస్ సంధర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో తన తండ్రి మమ్ముట్టి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. “నేను నటించడం నాన్న మమ్ముట్టి గారికి ఇష్టం లేదు. అందుకే చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకోమని దుబాయ్ పంపించారు. కానీ, ఇష్టం లేని ఉద్యోగం చేయలేకపోయాను. మళ్లీ తిరిగి వచ్చేసా. అప్పుడు హీరో ని అవుతాను అని చెప్పాను. నాన్న కోఫడ్డారు. నీకు నటించడం రాదు..ఇప్పటి వరకు చిన్న డ్యాన్స్ కూడా చేయలేదు. ఇలా నువ్వు తెర పీ కనిపించి నా పరువు తీయ్యకు. నీకు నటించడం రాకపోతే మొదట తిట్టేది నన్నే..”అంటూ తండ్రి మాటలను గుర్తుచేసుకున్నాడు దుల్కర్ సల్మాన్.