టాలీవుడ్లో ప్రేమ వివాహాలు చేసుకున్న స్టార్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్ ఒకరు. మహేష్ బాబు మాజీ మిస్ ఇండియా బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వయసులో మహేష్ కంటే నమ్రత ఏడాది పెద్ద. ఒకప్పుడు మిస్ ఇండియాగా ఉన్న నమ్రత ఆ తర్వాత బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 20కు పైగా సినిమాలలో నటించింది. వీరిద్దరూ కలిసి పద్మాలయ స్టూడియోస్ బ్యానర్‌పై బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ సినిమాలో నటించారు.
ఆ సినిమా అంచనాలు అందుకోలేకపోయినా… ఆస్ట్రేలియాలో జరిగిన షెడ్యూల్లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత నమ్రతను మహేష్ పెళ్లి చేసుకునేందుకు మహేష్ తండ్రి కృష్ణకు ఇష్టం లేకపోయినా వీరు పెళ్లి చేసుకున్నారు. 2005 ఫిబ్రవరి 10న మహేష్ – నమ్రత పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం నమ్రత.. మహేష్ సినిమా కెరియర్ పై పూర్తిగా ఫోకస్ చేసింది. అంతేకాకుండా మహేష్ ఎప్పుడు గ్లామర్‌గా ఉండేలా అతడి ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
మరోవైపు ఇద్దరు పిల్లల అలనా పాలన చూసుకోవడంతో పాటు తమ సొంత నిర్మాణ సంస్థ వ్యవహారాలు… అటు మహేష్ వ్యాపార వ్యవహారాలు కూడా చాలా వరకు చెక్కపెడుతూ వస్తుంది. నమ్రత తన లైఫ్ లోకి వచ్చాక మహేష్‌లో చాలా మార్పు కనిపించింది. అంతకు ముందు వరకు మహేష్ చాలా సిగ్గుతో బిడియంగా ఉండేవాడు. నమ్రత వచ్చాక మహేష్ లో ఎంతైనా మార్పు వచ్చింది. ఇక నమ్రత – ఆడపడుచు మంజుల ఎంతో స్నేహంగా ఉంటారు. వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది.
అయితే మహేష్ – మంజుల మధ్య ప్రేమాయణం నడుస్తున్నప్పుడు.. ఆ విషయం మంజులకు తెలియకుండా నమ్రత పెద్ద గేమ్ ఆడిందట. అప్పటికే మంజుల – నమ్రత మధ్య కూడా మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ఓ ఫంక్షన్ లో కలుసుకున్నారు. అప్పటినుంచి మంచి స్నేహితులు అయ్యారు. ఇటు మహేష్‌తో ప్రేమాయణం… అటు మంజులతో స్నేహం కొనసాగుతున్నా మంజులకు మాత్రం ప్రేమ విషయం తెలియకుండా నమ్రత చాలా జాగ్రత్త పడిందట.
విచిత్రం ఏంటంటే మంజుల- నమ్రత ఒకేసారి గర్భం ధరించటం జరిగిందట. ఇక మహేష్ తో పెళ్లి తర్వాత తాను సినిమాలకు దూరం కావటం వల్ల ఎప్పుడు బాధపడలేదని… తనకు మహేష్ కంటే సినిమాలు ఎక్కువ కాదని చెప్పింది. మహేష్ కెరీర్ పై దృష్టి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నానని నమ్రత తెలిపింది ఇక మళ్ళీ ఇప్పుడు తెరపై కనిపించాలన్న ఆలోచన కూడా తనకు లేదని నమ్రత వెల్లడించింది.