Movies' మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌... త‌ట్టాబుట్టా స‌ర్దేసుకోవ‌డ‌మే..!

‘ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌… త‌ట్టాబుట్టా స‌ర్దేసుకోవ‌డ‌మే..!

యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమాను ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఇప్పటివరకు ఎడిటర్ గా ఉన్న ఎమ్మెస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అయ్యారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న యంగ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. టీజర్లు – ట్రైలర్లతో భారీ అంచనాలు రావడంతో మాచర్ల నియోజకవర్గం ఖ‌చ్చితంగా నితిన్ కెరియర్లో మాస్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ భావించారు.

ఈ శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇది తొలి సినిమా అయినా దర్శ‌కుడు రాజశేఖర్ రెడ్డి కథ‌, కథనాలను ఏమాత్రం ఆసక్తితో నడప లేకపోయారు అన్న విమర్శలు వచ్చాయి. పరమ రొటీన్ స్టోరీ ఎంచుకొని మాచర్ల నియోజకవర్గాన్ని అంతే రొటీన్ గా తెరకెక్కించారని విమర్శకులు ఏకీపడేశారు. అయితే సినిమాపై ఉన్న హైప్‌తో తొలిరోజు ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల షేర్ వ‌చ్చింది. ఇది నితిన్ కెరియర్ లో మంచి ఓపెనింగ్ గా నిలిచింది. ఇక మహతి స్వర సాగర్ అందించిన సంగీతం కూడా బాగోలేదన్న విమర్శలు వచ్చాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నిలవాలంటే దాదాపు రు. 20 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే రెండో రోజు నుంచే చాలాచోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అటు అడ్వాన్స్ బుకింగ్లు కూడా సరిగా లేవు. దీనికి తోడు శనివారం రిలీజ్ అయిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ వీకెండ్ కే చేతులెత్తేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నితిన్ కెరీర్ లో మరో డిజాస్టర్ చేరినట్టే. మాచర్ల నియోజకవర్గం తొలిరోజు ఏరియాల వారి వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – 1.42 కోట్లు
వైజాగ్ – 69 ల‌క్ష‌లు
కృష్ణ – 30 ల‌క్ష‌లు
ఈస్ట్ – 46 ల‌క్ష‌లు
వెస్ట్ – 22 ల‌క్ష‌లు
గుంటూరు – 55 ల‌క్ష‌లు
నెల్లూరు – 26 ల‌క్ష‌లు
సీడెడ్ – 76,11213
కర్ణాటక – 18 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా లో – 97 ల‌క్ష‌లు
——————————————–
టోట‌ల్ ఫ‌స్ట్ డే వసూళ్లు – 4.96 కోట్లు
——————————————–

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news