టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు అటు వెండి తెరతో పాటు ఇటు బుల్లితెరపై బిజీబిజీగా ఉన్నారు. పలు షోలకు జడ్జిగా ఉన్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు. అయితే ఆయన భార్య పద్మజ గురించి పెద్దగా ఏ విషయాలు బయటకు రావు. నాగబాబు రుద్రవీణ సినిమా షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నప్పుడు తల్లి అంజినా దేవి ఆయనకు పద్మజతో పెళ్లి ఫిక్స్ చేశారు. అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఇష్టపడ్డారట. ఆమె అయితే నాగబాబుకు ఈడు జోడు బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అలా పద్మతో నాగబాబు పెళ్లయ్యింది.
గతేడాది నాగబాబు – పద్మజా దంపతుల కుమార్తె నిహారికకు చైతన్యతో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ దంపతుల ముద్దుల కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కూడా వీరు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. వరుణ్ తేజ్ హీరోయిన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న వార్తలు గత ఏడాదికాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ సీక్రెట్ గా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి.
నాలుగైదు నెలల క్రితమే లావణ్య పుట్టినరోజు సందర్భంగా వరుణ్ కోటి రూపాయల డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేస్తున్నాడు అన్న టాక్ కూడా బయటకు వచ్చింది. వీరిద్దరి ప్రేమ గురించి వరుణ్ – లావణ్య ఎప్పుడు పబ్లిక్ గా స్పందించలేదు. అయితే లావణ్య మాత్రం నాగబాబు ఫ్యామిలీకి ఇప్పటికే దగ్గరయింది. వరుణ్ సోదరి నిహారిక పెళ్లి రాజస్థాన్‌లో జైపూర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే అక్కడ పెళ్ళికి ఆహ్వానం అందింది.
అయితే లావణ్య ఈ పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి నాగబాబు ఫ్యామిలీతోనే ఉంది. నిహారికను పెళ్లి కుమార్తెను చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క పని దగ్గరుండి మరి చూసుకుంది. నాగబాబు భార్య పద్మజకు కూడా లావణ్య బాగా నచ్చేసిందని టాక్. కొడుకు ప్రేమకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే వరుణ్ తేజ్ – లావణ్య పెళ్లి విషయంలో నాగబాబు ఫ్యామిలీ సుముఖంగానే ఉంది. అన్నిటికి మించి లావణ్యను కోడలిగా చేసుకోవటం పద్మజకు బాగా ఇష్టం అని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల తర్వాత ఎప్పుడైనా వీరి పెళ్లి గురించి ప్రకటన వచ్చే ఛాన్సులు ఉన్నాయి.