Moviesఆ హీరో భార్య రెండో పెళ్లి చేసుకుంటోందా... ఆ మాట‌ల అర్థం...

ఆ హీరో భార్య రెండో పెళ్లి చేసుకుంటోందా… ఆ మాట‌ల అర్థం అదేనా…!

సీనియ‌ర్ హీరో యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ళ్లుడు, కన్నడ స్టార్‌ చిరంజీవి సర్జా చాలా చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. క‌రాబు మైండ్ అన్న ఒకే ఒక్క సాంగ్‌తో చిరంజీవి స‌జ్జా ఇండియా వైజ్‌గా ఎంత పాపుల‌ర్ అయ్యారో చూశాం. ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న యంగ్ హీరో మృతి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు సైతం పెద్ద షాక్ ఇచ్చింది. ఆయ‌న మరణంతో ఎంతగానో కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌. ఎంత బాధాక‌రం అంటే చిరంజీవి మృతి చెందిన‌ప్పుడు మేఘ‌న గ‌ర్భ‌వ‌తిగా ఉన్నారు.

Kannada Stars Chiranjeevi Sarja, Meghana Raj Get Married; Check Out Pics,  Videos Of Their Fairy Tale Wedding | India.com

భ‌ర్త‌ను కోల్పోయినా కూడా ఆమె మ‌నోధైర్యంతో ఉండి కొన్ని నెల‌ల త‌ర్వాత ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చారు. త‌న కొడుకులోనే భ‌ర్త‌ను చూసుకుంటూ ఆమె కాలం వెళ్ల‌దీస్తోంది. మేఘ‌న‌ది కూడా చిన్న వ‌య‌స్సే. ఆమెకు ఇంకా చాలా భ‌విష్య‌త్తు ఉంది. ప్ర‌స్తుతం కొడుకును ముద్దుగా పెంచుకుంటున్నా ఆమె మ‌ళ్లీ రెండో పెళ్లికి రెడీ అవుతోంద‌న్న వార్త‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఈ వార్త‌ల‌పై మేఘ‌న తాజాగా స్పందించింది.

Actress Meghana Raj opens up about second marriage - Tamil News -  IndiaGlitz.com

కొంద‌రు న‌న్ను రెండో పెళ్లి చేసుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం నా కొడుకును బాగా చూసుకోండి… అత‌డితోనే ఉండ‌మ‌ని చెపుతున్నారు. ఇప్పుడు తాను ఎవ‌రి మాట వినాల‌ని కూడా తిరిగి ప్ర‌శ్నించారు. ఇక త‌న భ‌ర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట త‌న‌కు చెపుతుండేవార‌ని.. ఈ ప్ర‌పంచం ఏమ‌నుకుంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెట్టేసి.. నీ మ‌న‌సుకు ఏది అనిపిస్తే అదే చేయ‌మ‌ని చెప్పేవాడ‌ని తెలిపింది.

ఇక తాను మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌న్న‌దానిపై త‌న‌కు తాను ఎప్పుడూ ప్ర‌శ్నించుకోలేద‌ని.. రేపు ఏం జ‌రుగుతుంది… త‌ర్వాత నా జీవితం ఎలా ఉంటుంద‌న్న‌ది తెలియ‌ద‌ని మేఘ‌న చెప్పుకువ‌చ్చింది. ఏదేమైనా మేఘ‌న రెండో పెళ్లి గురించి భ‌విష్య‌త్తులో ఆలోచ‌న చేస్తాన‌న్న‌ట్టుగా క్లారిటీ అయితే ఇచ్చింది. ఇక చిరంజీవి స‌ర్జా – మేఘ‌నారాజ్ ప‌దేళ్లు ప్రేమించుకుని 2018 మే 2న పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత మేఘ‌న ప్రెగ్నెంట్ అయిన కొద్ది నెల‌ల‌క చిరంజీవి 2020 జూన్‌ 7న గుండెపోటుతో మరణించారు. వీరికి రాయన్‌ రాజ్‌ సర్జా అనే కొడుకు పుట్టాడు.

Woman Up S3 EXCLUSIVE: Meghana Raj on tough times post Chiranjeevi Sarja's  demise & finding human resilience | PINKVILLA

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news