అమీర్‌ఖాన్ – కరీనా కపూర్ జంటగా తెలుగు హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన సినిమా లాల్‌సింగ్ చద్దా. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకు మెగాస్టార్ చిరు సమర్పకుడిగా ఉండడం. నాగార్జున కూడా సినిమాను బాగా ప్రమోట్ చేయడం.. ఇటు తెలుగు హీరో నాగచైతన్య ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ముందు నుంచే హిందూ సంస్థల ద్వారా నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
లాల్ సింగ్ చడ్డా ( అమిర్ ఖాన్) అంత తెలివితేటలు ఉన్న వ్యక్తి కాదు. అయితే అతడు ప్రేమించిన రూపా (కరీనా కపూర్) డబ్బుపై కోరికతో అతడిని విడిచి వెళ్లిపోగా.. లాల్ జీవితంలో మిగిలిన వారు కూడా దూరమవుతారు. ఈ టైంలో అతడు స్టార్ట్ చేసిన కొత్త జర్నీ ఏంటి ? ఈ ప్రయాణంలో రూపాను అతడు పెళ్లి చేసుకున్నాడా ? మధ్యలో నాగచైతన్య పాత్ర ఏంటన్నదే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ సినిమా కథ 1970వ కాలంలో నడుస్తుంది. సినిమాలో వచ్చే ఎమోషనల్ సీన్లు, కామెడీ బాగున్నాయి. అలాగే అమిర్ ఖాన్ యాక్టింగ్.. అమిర్ – చైతు సీన్స్ బాగున్నాయి. ఇక హీరోయిన్ కరీనా తన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకుంది. కొన్ని లవ్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. చైతు కూడా బాలరాజు పాత్రలో చాలా బాగా నటించాడు.
దర్శకుడు అద్వైత్ చందన్ సూపర్ స్టోరీ లైన్ తీసుకున్నా ఆకట్టుకునేలా ప్రజెంట్ చేయలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని లవ్ సీన్లు, ఇంటర్వెల్.. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లు మాత్రమే బాగున్నాయి. ఇక స్క్రీన్ ప్లే సాగదీసినట్టు చాలా స్లోగా ఉంటుంది. దీనికి తోడు మెయిన్ సన్నివేశాలు కూడా బోరింగ్‌గా ఉంటాయి. ఇక ఈ సీరియస్ ఎమోషనల్ స్టోరీ క్లాస్ ప్రేక్షకులకు నచ్చుతుందే కాని బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఎక్కదు.
హీరో జర్నీ వరకు బాగానే ఎలివేట్ చేసినా.. ఆ పాత్ర సంఘర్షణ, సవాళ్లు బాగాలేవు. దర్శకుడు సెకండాఫ్‌ను ఎమోషనల్‌గా రన్ చేద్దామని చూసినా అది స్క్రీన్ మీద ఎఫెక్ట్ కాలేదు. సినిమాకు కీలకమైన సెకండాఫ్ చాలా బోరింగ్‌గా ఉండడం సినిమాకు పెద్ద మైనస్. ఓవరాల్‌గా దర్శకుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా దానికి తగినట్టుగా సరైన కథనం రాసుకోలేదు.
ఏదేమైనా అమిర్ ఖాన్ – నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా నార్త్ ప్రేక్షకులను మెప్పించదు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్ అయ్యేలా లేదు. చైతుకు ఇది పెద్ద డిజప్పాయింట్ సినిమాయే.
రేటింగ్ : 2 / 5