టైటిల్: కార్తీకేయ 2
బ్యానర్: పీఫుల్స్ ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ బ్యానర్
నటీనటులు: నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్‌ఖేర్, ఆదిత్య మీనన్, కేఎస్. శ్రీథర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాతలు: విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్
రచన – దర్శకత్వం: చందు మొండేటి
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 145 నిమిషాలు
రిలీజ్ డేట్: 13 ఆగస్టు, 2022
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా కార్తీకేయ. ఎప్పుడో ఐదారేళ్ల క్రితం వచ్చిన కార్తీకేయ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తీకేయ 2ను తెరకెక్కించారు. రెండు నెలల నుంచి రిలీజ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఈ సినిమా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన కార్తీకేయ 2 సీక్వెల్స్‌పై ఉన్న నెగటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి ప్రేక్షకులను ఎలా మెప్పించింది ? ఆ సినిమా కథేంటో TL సమీక్షలో చూద్దాం.
కథ:
డాక్టర్ కార్తికేయ (నిఖిల్) మూఢనమ్మకాల వెనుక శాస్త్రీయ తర్కాన్ని కనుకునే వ్యక్తి. కార్తీకేయ ఫస్ట్ పార్ట్‌లో లాగానే సుబ్రహ్మణ్యపురంలో జరిగినట్టుగా ద్వారకలో జరిగే పరిస్థితుల వెనక రహస్యాలను కనుక్కునే పనిలో ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నో పురాతన విషయాలతో పాటు ద్వారకలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తుంటాయి. మరోవైపు శ్రీకృష్ణుడికి ఆభరణాల కోసం వెతుకుతున్న ముఠాతో కూడా కార్తీకేయ ఇబ్బందుల్లో పడతాడు ? చివరకు కార్తీకేయ కనుకున్న రహస్యాలు ఏంటి ? ఈ కథ తీవ్ర ఉత్కంఠ మధ్య ఎలా ? మలుపులు తిరిగింది అన్నదే ఈ సినిమా.
TL విశ్లేషణ :
దర్శకుడు చందూ మొండేటి కార్తీకేయ లాంటి రేసీ థ్రిల్లర్ తో మంచి హిట్ కొట్టాడు. ఇన్నేళ్లకు ఇప్పుడు సీక్వెల్ వస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథా పరంగా చూస్తే కార్తీకేయ 2 గొప్పది కాదు.కానీ ఎంచుకున్న నేపథ్యం, కొత్త అంశాలను పరిచయం చేయడం.. కట్టిపడేసే కథనంతో సినిమా సక్సెస్ అయ్యింది. సెకండాఫ్‌లో శ్రీకృష్ణుడి నేపథ్యాన్ని ఎలివేట్ చేయడం కూడా బాగుంది.
హిందూమత నేపథ్యం కూడా సినిమాలో కీలకంగా ఎలివేట్ చేశారు. ఇక సినిమా మంచి థ్రిల్ ఫీల్ అయితే ఇస్తుంది. ఫస్టాఫ్ అంతా ఇంట్రస్టింగ్‌గా సాగగా.. ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది. ఇది సెకండాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సినిమాలో మిస్టరీ అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రతి సీన్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.. సెకండాఫ్‌లో క్లైమాక్స్ వరకు అంతే ట్విస్ట్ నడుస్తుంటుంది.
దర్శకుడు చందు క్లైమాక్స్‌లో అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కొన్ని లోపాలు ఉన్నా.. కథ అంతా ఇంట్రస్టింగ్‌గా నడుస్తుండడంతో అవి కప్పడిపోతాయి. ఏదేమైనా నిఖిల్‌కు మరో మంచి హిట్ అయితే పడింది.
నటీనటుల పెర్పామెన్స్ :
నిఖిల్ కార్తీకేయ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాలో ఎప్పుడు పరిష్కరించని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పాత్రలో బాగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ తన పాత్రలో డీసెంట్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బాగానే నటించినా అతడి పాత్రకు డబ్బింగ్ సెట్ కాలేదు.
శ్రీనివాస్ రెడ్డి తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు. ఇక ఆదిత్య మీనన్ నెగటివ్ రోల్లో పాత్రకు తగినట్టుగా కనిపించాడు. మిగిలిన నటులు పాత్రల మేరకు మెప్పించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్‌గా చూస్తే సినిమాలు విజువల్స్ అదిరిపోయాయి. ఈ కథకు లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కించినా కూడా కళ్లు చెదిరిపోయేలా సినిమాటోగ్రఫీ ఉంది. ఇక కాలభైరవ సంగీతం బాగున్నా నేపథ్య సంగీతంపై మరింత దృష్టిపెడితే బాగుండేది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగానే ఉంది. ఇక తన గత చిత్రం సవ్యసాచితో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా దర్శకుడు చందు ఈ సినిమాతో అద్బుతమైన ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్‌లు ( + ) :
– ఫ్రెస్ ఫీల్ ఉన్న స్టోరీ
– నిఖిల్ యాక్టింగ్
– రైటింగ్
– ఎంగేజింగ్ డ్రామా
– లొకేషన్లు
మైనస్‌లు ( – ) :
– కొన్ని సీన్లలో లాజిక్ లేకపోవడం
– స్క్రీన్ ప్లే ఓవర్ స్పీడ్
ఫైనల్‌గా…
కార్తికేయ-2 హిందూ తీర్థయాత్రలు, ప్రయాణం నేపథ్యంతో పాటు పౌరాణిక ఇతివృత్తంతో కూడిన మంచి సినిమా. ఓవరాల్‌గా ప్రతి ఒక్కరు సినిమా చూస్తూ థ్రిల్ ఫీలవుతారు.
ఫైనల్ పంచ్ : సీక్వెల్ కూడా సూపర్ హిట్టే..
కార్తీకేయ 2 రేటింగ్ : 3.25 / 5