నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా మరియు ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వల్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. రెండు నెలల ముందే షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్నా కార్తికేయ 2 ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల ఒత్తిడికి తలొగ్గి పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. శనివారం రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో సాయంత్రానికే ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్ అయ్యాయి.
ఇక శుక్రవారం నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజ్ అయ్యి తొలిరోజు రు. 5 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఎప్పుడైతే శనివారం రిలీజ్ అయిన కార్తికేయ 2 సినిమాకు హిట్ టాక్ వచ్చిందో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సినిమాకు షోలు పెంచడం మొదలుపెట్టారు, ఒక్కసారిగా నితిన్ సినిమా షోలు తగ్గించేయడంతో ఆ సినిమా వసూళ్లు డ్రాప్ అయిపోయాయి. దీనికి తోడు డిజాస్టర్ టాక్ రావడంతో నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే నిలబడటం కష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు థియేటర్లలో బింబిసార – సీతారామం సినిమాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఇటు కార్తికేయ 2కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ మూడు సినిమాల మధ్యలో నితిన్ సినిమా నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కార్తికేయ 2 సినిమాకు ఏపీ – తెలంగాణలో మొదటి రోజు 5.30 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రు. 3.50 కోట్ల షేర్ వసూలు అయింది. కర్ణాటక – రెస్ట్ ఆఫ్ ఇండియాలో 25 లక్షలు… ఓవర్సీస్ లో 1.30 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఒక్క తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే తొలిరోజు అయిదు కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అలాగే 8.50 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే కార్తికేయ 2కు రు. 12.8 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. రు. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మార్కెట్లో బరిలోకి దిగిన ఈ సినిమా మరో ఎనిమిది కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
అయితే ఆదివారంతో పాటు సోమవారం ఇండిపెండెన్స్ డే హాలిడే కావడంతో ఈ రెండు రోజుల్లోనే సినిమా పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకువస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా బింబిసార – సీతారామం సినిమాల విజయం పరంపర కొనసాగించడంలో నితిన్ విఫలమైతే… కార్తికేయ 2 సినిమాతో నిఖిల్ మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పాలి.