క్లాస్ చిత్రాల దర్శకుడిగా పాపులర్ అయి నెమ్మదిగా ఒక్కో సినిమాను చేస్తూ తనకంటూ టాలీవుడ్‌లో మార్కెట్‌ను సంపాదించుకున్నారు శేఖర్ కమ్ముల. మొదటి సినిమా డాలర్ డ్రీంస్. ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. అయితే, ఆనంద్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకట్టుకున్నాడు. ముందు ఈ ఆనంద్ కథను పవన్ కళ్యాణ్‌కి చెప్పాలనుకున్నారు. కానీ, అది సాధ్యపడేదా..అంత వీజీ కాదు. అందుకే, ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలను అనుకొని ఫైనల్‌గా రాజాని ఎంచుకున్నారు.
ఇక ఈ మూవీ ద్వారా కమిలినీ ముఖర్జీని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అయితే, ఏ దర్శకుడికైనా హీరోయిన్స్‌ను తెరమీద అందంగా చూపించాలనుకుంటారు. ఈ విషయంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్ దర్శకేంద్రుడిది హీరోయిన్ బిడ్డు మీద పూలు పళ్లు విసిరే స్టైల్. ఇంకొదరిది నడుము, నాభి చూపించాలని ఉంటుంది. మరికొందరు ఎద అందాల మీద ఫోకస్ పెడతారు. రోజా అంటే ఆమె పెదవులపై ఫోకస్ పెట్టేవారు. తన స్మైల్ బావుంటుంది.
ఇలా ఒక్కొక్కరు హీరోయిన్స్‌లో ఉన్న సెక్స్ అపీరియన్స్ మీద దృష్టి పెట్టి దాన్ని హైలెట్ చేసి స్క్రీన్ మీద చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. ఈ విషయంలో దర్శకుడు శేఖర్ కమ్ములది ఒక స్టైల్. ఆయన ఎక్కువగా హీరోయిన్ నడుము, బ్యాక్ మీద ఫోకస్ చేస్తుంటారు. ఇది ఆనంద్ సినిమా నుంచి గమనించవచ్చు. ఈ సినిమాలో కమిలినీ వెనకభాగం ఎక్కువసార్లు చూపించారు.
ఫిదా సినిమాలో కూడా ఓ సీన్‌లో సాయి పల్లవి బ్యాక్ చూపించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. ఇలా తన సినిమాలో నటించిన సాయిపల్లవిని ఇంత అందంగా చూపించి స్టార్ స్టేటస్ ఇచ్చారు. శేఖర్ కమ్ముల పైకి కనిపించరు గానీ, ఆయనలో కనపడని రొమాంటిక్ యాంగిల్ ఉందని తన హీరోయిన్స్‌ని తెరమీద చూస్తే అర్థమవుతుంది. ఇక శేఖర్ కమ్ములకి వర్షంలో హీరోయిన్‌ని చూపించడం కూడా చాలా ఇష్టం. సినిమాలో ఒక్క సీన్‌లో అయినా హీరోయిన్ వర్షంలో తడిచే సీన్ ఉంటుంది.