సిమ్రాన్.. తొలిసారి జీరో సైజ్ అంటే ఏంటో ఇండస్ట్రీకి రుచి చూపించిన హీరోయిన్. తన నడుము ఒంపులో కుర్రకాలను గింగిరాలు తిప్పిన అందాల దేవత. ముంబైలో మోడలింగ్ చేస్తూ సినిమా రంగంలోకి ప్రవేశించింది సిమ్రాన్. తొలుత హిందీలో సనమ్ హర్ జాయ్ సినిమాతో నటించడం మొదలు పెట్టింది. ఆ తరువాత తెలుగు తమిళ భాషల్లో అగ్ర కథానాయకగా 90వ దశకంలో బిజీ హీరోయిన్ గా కెరియర్ కొనసాగించింది. తెలుగు సినిమాల కన్నా కూడా తమిళంలోనే సిమ్రాన్ ఎక్కువగా నటించి పాపులాంటి సంపాదించుకుంది. 1999 నుంచి 2004 వరకు ఆమె ఒక రేంజ్ లో తన హవాని చూపించింది.
కేవలం అందాల ఆరబోతకి ప్రాధాన్యత ఇవ్వకుండా పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ సౌత్ ఇండియా ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. తెలుగులో సైతం టాప్ హీరోల అందరితో నటించిన సిమ్రాన్ సమరసింహారెడ్డి, సీతయ్య, కలిసుందాం రా, నరసింహానాయుడు వంటి సినిమాలతో తనదైన గుర్తింపును దక్కించుకుంది. ఇక లీల అనే సినిమాలో చివరిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సిమ్రాన్ ఆ తర్వాత సీరియల్స్ లోనూ నటించింది.
అలాగే తన సొంత ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేసింది. తన భర్త దర్శకత్వంలో ఒక పాటలో నర్తించింది. ఇక తమిళంలో మళ్లీ పేట సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సిమ్రాన్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఆమె కెరియర్ పీక్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్‌తో ఎక్కువగా క్లోజ్ గా ఉన్నట్టు అప్పటి మీడియా వార్తలు బట్టి చూస్తే అర్థమవుతుంది.
పంచతంత్రం మూవీలో కమల్ హాసన్ తో కలిసి నటించిన సిమ్రాన్ ఈ సినిమా సమయంలో అతడితో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. సినిమా షూటింగ్‌లోనే కాకుండా బయట కూడా వీరు మీడియా కంట పడడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరు గాడమైన ప్రేమలో మునిగి తేలుతున్నారన్న టైంలోనే కమల్‌తో సిమ్రాన్ కి బ్రేకప్ కూడా జరిగింది. ఎందుకంటే అప్పటికే గౌతమితో మరోమారు ప్రేమలో పడ్డాడు కమల్ హాసన్.
దాంతో కమల్ కి దూరంగా వెళ్లిపోయి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మెల్లిమెల్లిగా తప్పుకోవడం మొదలుపెట్టింది. ఇక చివరిగా 2014లో దృశ్యం సినిమాలో కమల్ హాసన్‌తో నటించే అవకాశం వచ్చినా సిమ్రాన్ నో చెప్పిందట. కమల్ తనను అవకాశం ఉన్నప్పుడు వాడుకున్నాడని ఆమె సన్నిహితుల దగ్గర వాపోయేదట. అలా సిమ్రాన్ కమల్ హాసన్ లో ప్రేమ కథ ముగిసిపోయింది. కెరియర్ ముగిసిన తర్వాత ఆ సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆమెకి ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారు.