కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. సినిమా ఇండస్ట్రీకి రాక ముందు ఆమె మోడల్ గా చేసింది. అలా చూసే సినిమాలలో అవకాశాలు ఇచ్చారు. మెహ్రీన్ స్క్రీన్ మీద కనిపించిన మొదటి సినిమా ఫిల్లౌరీ. హిందీలో 2017 లో వచ్చిన ఈ మూవీతో బాగానే పేరు తెచ్చుకుంది. ఈ మూవీ ద్వారానే తెలుగులో నాని హీరోగా హను రాఘవపూడి రూపొందించిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అయితే, సాధారణంగా మొదటి సినిమా ఏ దర్శకుడితో చేస్తారో ఆ దర్శకుడితోనే ఎక్కువగా ట్రావెల్ అవుతుంటారు హీరోయిన్. దీనికి ఉదాహరణలు కూడా ఇప్పటికే చాలా ఉన్నాయి. వరుసగా మూడు నాలుగు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా పాపులారిటీ వచ్చే వరకు తమ మొదటి సినిమా దర్శకుడిని వదలరు. పూజాహెగ్డేకు హిట్ ఇచ్చిన ఇద్దరు దర్శకులను ఇప్పుడు వదల్లేదు. వారు ఎప్పుడు డేట్స్ కావాలన్నా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది.
పూరీ పరిచయం చేసిన హీరోయిన్స్ కూడా అంతే. అయితే, పూరీ ఇప్పటివరకు అలా రిపీట్ చేసిన చేసిన హీరోయిన్ చాలా తక్కువమంది. అయితే, మొదటి సినిమా పరిచయం చేయకపోయినా వరుసగా హిట్స్ ఇస్తున్న కారణంతో హీరోయిన్ మెహ్రీన్ దర్శకుడు అనిల్ రావిపూడి వదలడం లేదట. వాస్తవంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి ఇచ్చిన సక్సెస్‌లతోనే మెహ్రీన్ ఇంకా తెలుగులో హీరోయిన్గా కొనసాగుతోంది. మాస్ మహారాజా రవితేజతో అనిల్ రావిపూడు తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమాలో హీరోయిన్గా మెహ్రీన్ కి ఛాన్స్ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఈ సినిమా బ్లాక్ బస్టర్.
ఆ తర్వాత వెంకటేశ్ – వరుణ్ తేజ్ హీరోలుగా తమనా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా ఎఫ్ 2 వచ్చి భారీ హిట్ అందుకుంది. ఇక ఇటీవల ఈ మూవీ సీక్వెల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కూడా ఓ హీరోయిన్గా మెహ్రీన్ నటించింది. అందుకే, మెహ్రీన్ – అనిల్ రావిపూడిల మధ్య ఏదో ప్రత్యేక అనుబంధం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో వాస్తవ, అవాస్తవాలు వారికే తెలియాలి.