Moviesకాజల్ అగర్వాల్ వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా..?

కాజల్ అగర్వాల్ వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా..?

కాజల్ అగర్వాల్ వల్ల ఆ హీరోయిన్ కెరీర్ నాశనం అయిందా..? అవును ఇదే మాట కొన్నేళ్ళ క్రితం బాగా వినిపించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్దా దాస్. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలలో హీరోయిన్‌గా..సెకండ్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో శ్రద్దా దాస్ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్ధూ ఫ్రం శీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో వరుసగా సినిమాలకు సైన్ చేసింది. వీటిలో ఆమె కెరీర్ టర్న్ అవుతుందీ అని చేసిన సినిమా ఆర్య 2.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అల్లు అర్జున్, నవదీప్ హీరోలుగా నటించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ సెకండ్ లీడ్ లాంటి రోల్ చేసింది. అల్లు అర్జున్ రెండవ సినిమా… దర్శకుడిగా సుకుమార్‌కి మొదటి సినిమా ఆర్య. ఈ సినిమా ఇద్దరి కెరీర్‌ని మలుపు తిప్పింది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా ఆర్య 2 రూపొందుతుండటంతో ఈ సినిమా మీద అందరికంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది శ్రద్దా దాస్. సుకుమార్ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

అందుకే సుకుమార్ అడగగానే ఆర్య 2 సినిమాకు కాజల్ ఉందని తెలిసినా సైన్ చేసింది. అదే తన కెరీర్ సగం దెబ్బతినడానికి కారణం అవుతుందని శ్రద్దా దాస్ ఊహించలేదు. కాజల్ రేంజ్‌లో ఆర్య 2 సినిమా తనకీ సక్సెస్ తెచ్చి దాంతో ఓ స్టార్ డం తీసుకువస్తుందని భావించిన శ్రద్దా దాస్ సినిమా రిలీజైయ్యాక ఓ వ్యాంప్ టైప్ క్యారెక్టర్ చేసిందని టాక్ రావడంతో ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ మీద తప్ప ప్రేక్షకులు మిగతా వారిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. సుకుమార్ కూడా కాజల్ ని ఎంత అందంగా చూపించాడో.. అల్లు అర్జున్‌ని మేకోవర్ పరంగా అంత కొత్తగా చూపించాడు. కానీ, ఎటొచ్చీ పానకంలో పుడక, కూరలో కరివేపాకు మాదిరిగా ఏదో అందాలు ఆరబోస్తూ ఉందంటే ఉందీ అనిపించుకుంది మాత్రం శ్రద్దా దాసే. దాంతో ఆర్య 2 తన ఫ్యూచర్ కెరీర్ మీద బాగా ప్రభావం పడింది.

హీరోయిన్‌గా సెటిలవ్వాల్సిన శ్రద్దా దాస్ అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. చేయడానికి సినిమాలు చేసిన అవి తనకి స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టే పాత్రలు కాకపోవడం కాస్త షాకింగ్ విషయమే. అందుకే చాలామంది హీరోయిన్స్ ఒక మెయిన్ హీరోయిన్ ఉంటే అంత త్వరగా సెకండ్ లీడ్ చేయడానికి ఒప్పుకోరు. ఇలా లైఫ్ రిక్స్‌లో పడుతుందనే రిజెక్ట్ చేస్తారు. దీనికి ఉదాహరణ నమిత కూడా. ఆ సినిమా బిల్లాగా చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news