నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలిన రారాజు.. అన్నగా రు నందమూరి తారకరామారావు. ఆయన చిత్రాలు అన్నీ.. ఆణిముత్యాలే. కథను ఎంచుకోవడం కాదు.. అసలు అన్నగారు నటిస్తున్నారంటేనే.. కథ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకునేవారట. అన్ని విషయాల్లో నూ పర్పెక్ట్‌గా ఉండే అన్నగారు.. తనకు రావాల్సిన రెమ్యునరేషన్ విషయంలోనూ అంతే కఠినంగా ఉండేవారట.
సినిమా ఫలానా సమయానికి ప్రారంభం అవుతుంది.. అంటే.. దానికి ఓ అరగంట ముందు ఉండేవారు త ప్ప.. ఒక్క నిముషం కూడా ఆలస్యం అయిన సందర్భాలు లేవు. ఆదిలో అయితే.. రెండు మూడు గంటల ముందున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చేయడం వల్ల.. నిర్మాతకు భారం తగ్గుతుందని.. స్వయంగా ఎన్టీఆర్ చెప్పేవారు. అంతేకాదు.. పెద్దగా నిర్మాతలకు ఖర్చు పెంచేందుకు కూడా ఆయన ఇష్టపడేవారు. ఔట్ డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు కూడా.. తనకు అది కావాలి.. ఇది కావాలని.. పట్టుబట్టేవారు కాదు.
అయితే.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడేవారు కాదట. వాస్తవానికి ఆయన చాలా సంవత్సరాలు.. స్టూడియోల్లోనే పనిచేశారు. దీంతో నెలనెలా..వేతనం అందుకునేవారు. అయితే.. తర్వాత మారిన విధానంలో నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ అందుకునేవారు. అయితే..ఈ క్రమంలో కొందరు నిర్మాతలు.. ఇస్తామన్న సొమ్ములు ఇవ్వకుండా.. అన్నగారిని ఇబ్బంది పెట్టేవారట. కొందరు ఇస్తామన్న రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేసిన సందర్భాలు కూడా ఆయన ఎదుర్కొన్నారు.
దాదాపు పది చిత్రాల వరకు ఇలానే ఇబ్బందులు పడ్డ ఎన్టీఆర్.. తర్వాత.. తన పద్ధతిని మార్చుకున్నారట. ముందుగానే అడ్వాన్స్ తీసుకునే సంప్రదాయాన్ని ఆయన ప్రారంభించారట. అప్పటివరకు సినిమా మొదలయ్యాక.. కొంత మొత్తం తీసుకునేవారట. కానీ, నిర్మాతలు హ్యాండ్ ఇస్తుండడంతో ఆయన ఈ విషయంలో కఠినంగానే ఉండాలని నిర్ణయం తీసుకుని.. ముందు.. తర్వాత.. మధ్యలో అంటూ.. మూడు విడతల్లోనే తన రెమ్యునరేషన్ క్లియర్ చేయించుకునేవారట.
ఇక స్టార్ స్టేటస్ వచ్చాక కూడా ఆయన మరీ రెమ్యునరేషన్ అయితే పెంచలేదు. అయితే నిర్మాత స్థాయిని బట్టి ఆయన రెమ్యునరేషన్ తీసుకునేవారట. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తానే స్వయంగా రెమ్యునరేషన్ తగ్గించుకుని ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఉండడంలోనూ ఆయనకు ఆయనే సాటి అనిపించుకునేవారు.