Moviesనిన్న‌టి హీరోయిన్ సంఘవిని షూటింగ్‌లోనే తిట్టిన ఆ స్టార్ హీరో ఎవరో...

నిన్న‌టి హీరోయిన్ సంఘవిని షూటింగ్‌లోనే తిట్టిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

తమిళ సినిమా అమరావతితో తొలిసారి సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నిన్నటి తరం హీరోయిన్ సంఘవి. అలనాటి స్టార్ హీరోయిన్ ఆరతికి మనవరాలిగా ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తూ తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. దాదాపు 10 ఏళ్ల కెరియర్ లో 95 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందులో 45 సినిమాలు కేవలం తెలుగు సినిమాలే.. మిగతా కన్నడ, తమిళ చిత్రాల్లో నటించింది. తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సంఘవి కర్ణాటకకి చెందిన అమ్మాయి. మైసూర్ లో పుట్టిన సంఘవి తన నానమ్మను చూసి నటించాలని కోరికతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది.

 

తొలి సినిమాని స్టార్ హీరో విజయ్‌తో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో నటించిన సింధూరం సినిమా ఆమెకు టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించే అవకాశాన్ని కల్పించింది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు సైతం దక్కించుకుంది సంఘవి. కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన సంఘవి తెలుగు దర్శకుడైన సురేష్ వర్మతో ప్రేమలో పడింది. రాజశేఖర్ నటించిన శివయ్య సినిమాకి ఇతడు దర్శకుడుగా పనిచేశాడు. వీరు సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు కూడా.. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో అత‌డికి విడాకులు ఇచ్చేసింది.

ఆ త‌ర్వాత బెంగ‌ళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడి ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మళ్లీ తమిళంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది సంఘవి. ప్రస్తుతం తల్లి పాత్రల్లో చేయ‌డంతో పాటు బుల్లితెరపై కూడా అడుగుపెట్టి సీరియల్స్ తో పాటు కొన్ని షోస్ కూడా హోస్ట్ చేస్తోంది. ఇక స్నేహ, మీనా వంటి నటీమణులు ఈమెకి ప్రాణ స్నేహితులు కావడం విశేషం. హీరో అజిత్ లాంటి స్టార్‌కి ఈమె తొలి హీరోయిన్ కావడం విశేషం.

అసలు విషయంలోకి వెళితే సంఘవిని ఒకానొక సమయంలో హీరో విజ‌య్‌ ఎడాపెడా తిట్టేసాడట. విజయ్, సంఘవి కాంబినేషన్లో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. రాసిగాన్, కోయంబత్తూర్ మాపిలై, విష్ణు, నిలవేవా వంటి సినిమాల‌లో కలిసి నటించి వీరి కాంబినేషన్ అదుర్స్ అనిపించుకున్నారు. విష్ణు సినిమా షూటింగ్ సమయంలో ఒక విచిత్ర సంఘటన జరిగిందట. ఈ సినిమాకి దర్శకుడుగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ ప‌ని చేశారు.

ఇక షూటింగ్ సమయంలో నీటిలో దిగి డాన్స్ చేసే ఒక సన్నివేశం ఉండగా సంఘవి చాలా ధైర్యంగా నీటిలోకి దిగి విజయ్ కోసం ఎదురుచూస్తుందట. కానీ నీళ్లు చల్లగా ఉండడంతో విజయ్ నీళ్లలోకి దిగడానికి భయపడ్డాడట. చాలాసేపు చూసిన తర్వాత విజయ్ తండ్రికి కోపం వచ్చింది. ఆడపిల్ల సంఘవి ధైర్యంగా దిగింది. మగాడివి నువ్వు ఎందుకు ? దిగవు అంటూ కోప్పడ్డారట. దాంతో సంఘవిని చూసి విజయ్ నీవల్లే నన్ను తిడుతున్నారంటూ పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకాడట. అలా విజ‌య్‌ తనపై కోపడ్డాడు అంటూ ఈ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత సంఘవి బయట పెట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news