టాలీవుడ్‌లో బలమైన ఫ్యామిలీలలో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఒకటి. లెజెండ్రీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుపాటి వెంకటేష్ 35 సంవత్సరాలుగా తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. వెంకటేష్ సోదరుడు.. రామానాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు అగ్ర నిర్మాతగాను టాప్ ఎగ్జిబిటర్‌గాను ఉన్నారు. ఇక రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు రానా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు.
వెంకటేష్ విషయానికొస్తే 1986లో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకీకి జోడిగా ఖుష్బూ హీరోయిన్‌గా నటించింది. అప్పటివరకు అమెరికాలో ఎంబీఏ చదువుతున్న వెంకటేష్ ను ముందుగా హీరోగా చేయాలని రామానాయుడు అనుకోలేదు. అయితే వెంకీ ఇండియాకు తిరిగి వచ్చాక తనకు సినిమాలలో నటించాలన్న ఆసక్తి ఉందని చెప్పడంతో రామానాయుడు తన కొడుకుని హీరోని చేశారు.
ఇక వెంకటేష్ సినిమా టైటిల్స్‌లో రా అన్న అక్షరం చివర ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ కొద్దిరోజులపాటు నడిచింది. కలిసుందాం రా – జయం మనదేరా – ప్రేమించుకుందాం రా ఇలా చివర రాక్షరంతో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వెంకటేష్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్ల్‌తో నటించారు. అయితే హీరోయిన్ల విషయంలో వెంకీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఎవ్వరికి దొరికే వాడే కాదు. అయితే ఇద్దరు హీరోయిన్లతో వెంకటేష్‌కు ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు మాత్రం బయటకు వచ్చాయి.
వెంకటేష్ ఒకానొక సమయంలో మీనాతో ఎక్కువగా సినిమాలు చేశాడు. మీనా – వెంకటేష్ కాంబినేషన్ అంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఆ టైంలో వారిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు పుకార్లు షికార్లు చేశాయి.
ఆ తర్వాత వెంకటేష్ దివంగత హీరోయిన్ సౌందర్యది కూడా సూపర్ హిట్ కాంబినేషన్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. అప్పట్లో వీరు ఎంతో స్నేహంగా ఉండడంతో వీరి మధ్య కూడా ఇలాంటి గాసిప్పలే పుట్టాయి. అయితే వెంకటేష్‌పై ఎన్ని గాసిప్పులు వచ్చినా ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన కేరీర్ ప్లాన్ చేసుకున్నారు అన్నది నిజం.