సీనియర్ హీరోల సరసన ఇంకా చెప్పాలంటే ముసలి హీరోల సరసన నటిస్తే కెరీర్ త్వరగా దెబ్బైపోతుందనడానికి ఉదాహరణగా ఓ ముగ్గురు హీరోయిన్స్‌ను తీసుకోవచ్చు. ఆ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ అనుకోవచ్చు. వరుస ఫ్లాపుల తర్వాత క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చారు. అయితే, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా పాపులర్ అయిన నభా నటేష్ రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఇంత యంగ్ బ్యూటీకి రెండు సినిమాలతో రాని క్రేజ్ ఇస్మార్ట్ శంకర్‌తో వస్తే అది కాస్త రవితేజ సినిమా చేసి పోగొట్టుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా నభా కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇదే సినిమాలో నటించిన పాయల్ రాజ్‌పుత్ కూడా దెబ్బకు డైలమాలో పడింది. ఈ సినిమాకి ముందు పాయల్ వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా నటించిన వెంకీమామ సినిమాలో వెంకీ సరసన నటించింది.
ఈ సినిమా హిట్ అయినా కూడా రవితేజ సరసన నటించిన డిస్కో రాజా అట్టర్ ఫ్లాప్ పాయల్‌ని కష్టాల్లోకి నెట్టేసింది. వీరే కాదు, యంగ్ బ్యూటీ కుర్ర హీరోలతో రొమాన్స్ చేసి క్రేజీ హీరోయిన్‌గా మారాల్సిన మాళవిక శర్మ కూడా రవితేజ సరసన మొదటి సినిమా చేసి దెబ్బైపోయింది. నేల టికెట్ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది మాళవిక. వాస్తవంగా రామ్, ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ సహా కుర్ర హీరోల సినిమాతో పరిచయమై, ఆ సినిమా హిట్ అయితే తన కెరీర్ ఇంకోలా ఉండేదేమో..!
కానీ, రవితేజ లాంటి సీనియర్ హీరోతో నటించడం, ఆ సినిమా అట్టర్ ఫ్లాపవడం మాళవిక కెరీర్ మొదట్లోనే చతికిల పడింది. ఇలా చెప్పుకుంటే రవితేజ సరసన ఇటీవల నటించిన ఏ హీరోయిన్ అంతగా స్టార్ డం సాధించింది లేదు. మజిలీ భామ దివ్యాన్ష కౌశిక్, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ, రజీషా విజయన్ ..ఇలా లిస్ట్ చూస్తే చాంతాడంత బారు ఉంది. కానీ, రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి వారు మాత్రం నైస్‌గా అవకాశాలు వచ్చినా రవితేజ పక్కన నటించడానికి నో చెప్తున్నారట.