అల్లు అర్జున్ తన కెరీర్‌లో 20 ఏళ్లలో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగాడు. తాజాగా వచ్చిన పుష్ప సినిమాతో ఏకంగా తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు బన్నీ క్రేజ్ నేషనల్ వైడ్‌గా పాకేసింది. అయితే బన్నీ తన కెరీర్‌లో 12 సినిమాలు వదులుకున్నాడు. అయితే ఇందులో ఏకంగా 6 బ్లాక్‌బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. అలా బన్నీ వదులుకున్న సినిమాలు, ఆ హిట్లు ఏంటో చూద్దాం.
1-జయం :
అల్లు అర్జున్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటోన్న టైంలో అల్లు అరవింద్‌కు తేజ ఈ కథ చెప్పాడు. అరవింద్ కూడా తేజ ఫాంలో ఉండడంతో ఈ కథతోనే తన కుమారుడిని వెండితెరకు పరిచయం చేయాలనుకున్నాడు. అయితే ఈ కథ కాస్తా నితిన్‌కు చేరడంతో నితిన్ తొలి సినిమాతోనే హిట్ కొట్టాడు.
2- భద్ర:
సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు బోయపాటి శ్రీను తాను రాసుకున్న భద్ర కథను అల్లు అర్జున్‌కు చెప్పారు. అయితే అప్పుడే ఆర్య లాంటి ప్రెష్ స్టోరీ చేస్తూ వెంటనే ఇంత యక్షన్ సినిమా ఎందుకు అని బన్ని రిజెక్ట చేయడంతో ఆ హిట్ రవితేజ ఖాతాలో పడింది.
3- 100 % లవ్:
సుకుమార్ తాను రాసుకున్న కథ ముందు బన్నీకి చెప్పాడు. అయితే ఈ కథతో బన్నీ అస్సలు కనెక్ట్ కాలేదు. ఈ సాఫ్ట్ లవ్ స్టోరీస్ తనకు కనెక్ట్ కావని చెప్పడంతో చివరకు అరవింద్ నిర్మాతగా నాచైతన్య హీరోగా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
4- కృష్ణాష్టమి :
సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాలో ముందు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది. జోష్ దర్శకుడు వాసువర్మ లవర్ పేరుతో బన్నీ కోసం ఈ కథ రాసుకున్నాడు. అయితే చివరకు కృష్ణాష్టమి టైటిల్‌తో సునీల్ హీరోగా వచ్చి ప్లాప్ అయ్యింది. అయితే బన్నీ ఇదే దిల్ రాజుకు డీజే సినిమా చేశాడు.
5- పండగ చేస్కో:
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో పండగ చేస్కో సినిమా వచ్చింది. దర్శకుడు గోపీచంద్ ముందుగా బన్నీకి కథ చెప్పారు. రైటర్ కోన వెంకట్, గోపీ ఇద్దరూ కలిసి చెప్పిన కథలో ఎంటర్టైన్‌మెంట్ బాగుందని అన్నా బన్నీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో రామ్ హీరోగా పండగ చేస్కో వచ్చింది.
6 – అర్జున్ రెడ్డి:
సందీప్ రెడ్డి వంగా ఈ కథను బన్నీకే చెప్పాడు. అయితే ఎందుకో గాని బన్నీ ఈ కథ చేయడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఇదే సినిమా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు సందీప్.
7 – గ్యాంగ్ లీడర్:
మనం లాంటి క్లాసిక్ సినిమా రూపొందించిన విక్రమ్ కె కుమార్ నానితో గ్యాంగ్ లీడర్ తీశాడు. ముందు ఈ సినిమా కథ బన్నీతో అనుకున్నా తర్వాత నానితో తెరకెక్కించారు. బన్నీకి కథలో అనుమానాలు ఉన్నాయి. అయితే విక్రమ్ నానితో ఈ సినిమా తీసినా వర్కవుట్ కాలేదు.
8 – డిస్కో రాజా:
విలక్షణ సినిమాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ డిస్కో రాజా సినిమాను బన్నీతో చేయాలని అనుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు అల్లు శిరీష్‌తో ఒక్క క్షణం సినిమా చేశాడు. అప్పుడు బన్నీతో ఉన్న చనువు నేపథ్యంలో డిస్కో రాజా కథను బన్నీకి చెప్పగా ఈ కథకు మనోడు కనెక్ట్ కాలేదు. తర్వాత రవితేజతో చేసినా డిజాస్టర్ అయ్యింది.
9- గీత గోవిందం:
విజయ్ దేవరకొండ బన్నీ రిజెక్ట్ చేసిన అర్జున్ రెడ్డి కథతో హిట్ కొట్టాడు. తర్వాత గీతగోవిందం కథను కూడా ముందు పరశురాం బన్నీకే చెప్పగా నో చెప్పాడు. ఆ తర్వాత విజయ్ ఈ సినిమా చేసి హిట్ కొట్టాడు.
10 – జాను:
తమిళంలో సంచలన విజయం సాధించిన 96 తెలుగు రీమేక్‌ను సమంత హీరోయిన్‌గా బన్నీతో రీమేక్ చేయాలని దిల్ రాజు అనుకున్నాడు. అయితే అంత సాఫ్ట్ లవ్ స్టోరీ తనకు సెట్ కాదని బన్నీ వదులకోవడంతో తర్వాత శర్వానంద్ – సమంత జంటగా తెలుగులో జానుగా చేస్తే డిజాస్టర్ అయ్యింది.
11 – బొమ్మరిల్లు:
సిద్ధార్థ హీరోగా వచ్చిన ఆల్ టైం క్లాసిక్ బొమ్మరిల్లు సినిమాలో బన్నీని హీరోగా అనుకున్నారు. దర్శకుడు భాస్కర్ కథ చెప్పగా.. అప్పటికే హ్యాపీ సినిమా చేసిన బన్నీ ఈ కథ వద్దనుకున్నాడు. ఆ తర్వాత ఈ బ్లాక్ బస్టర్ సిద్ధార్థ్ ఖాతాలోకి వెళ్లిపోయింది.
12 – సుప్రీమ్:
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సుప్రీమ్ కథ బన్నీతో చేయాలనుకున్నారు. అయితే ఆ బ్లైండ్ క్యారెక్టర్ పై బన్నీ ఇష్టపడలేదు. చివరకు రవితేజ ఆ సినిమా చేసి హిట్ కొట్టాడు.