Moviesకేవలం విడాకుల వ‌ల్లే ఈ హీరోయిన్ల జీవితం ఇంత త‌ల్ల‌కిందులైందా..!

కేవలం విడాకుల వ‌ల్లే ఈ హీరోయిన్ల జీవితం ఇంత త‌ల్ల‌కిందులైందా..!

సినిమా జీవితం కాదు, జీవితం సినిమా అంతకన్నా కాదు. కానీ ఈ రెండింటికి బలమైన సంబంధం ఉంటుంది. కొన్నిసార్లు జీవితాన్ని సినిమా ఎంతగా ప్రభావం చేస్తుంది అంటే నటీనటులు చేసే ప్రతి చిన్న తప్పులు కూడా వేలెత్తి చూపి వారికి భవిష్యత్తు లేకుండా చేస్తారు. భార్యాభర్తలు విడిపోవాలంటే ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు. ఒకరి మనోభావాలు ఒకరికి నచ్చకపోయినా విడాకులు తీసుకుంటారు. అలాంటిది కేవలం విడాకులు తీసుకోవడం వల్లే సినిమా జీవితాన్ని కోల్పోయిన స్టార్ హీరోయిన్స్ ఉన్నారు వారెవరో చూద్దాం.

సమంత :
సమంత అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆమె పెళ్లికి ముందు సైతం బాగానే తన సినిమాలను చేసుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే నాగచైతన్యతో విడాకులు తీసుకుందో అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆమెను ఒక పూచిక పుల్లలా తీసిపారేస్తున్నారు అక్కినేని అభిమానులు. అసలు అక్కినేని కుటుంబం లేకపోతే సమంత కి హీరోయిన్ అయ్యే ఛాన్స్ కూడా లేదంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఇందులో నిజం ఎంత అనేది అందరికీ తెలిసిన కూడా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం సమంత చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. మ‌రో ఒక‌టి రెండేళ్ల త‌ర్వాత ఆమె ఫ్యూచ‌ర్ ఏంటి ? ఆమెను ఎవ్వ‌రు ప‌ట్టించుకుంటారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ లేదు. అదే అక్కినేని కోడ‌లిగా ఉండి ఉంటే స‌మంత రేంజ్ ఎలా ఉండేదో చెప్ప‌క్క‌ర్లేదు.

రేణు దేశాయ్ :
పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మూడోసారి ప్రేమలో పడటంతో రేణు దేశాయ్ అతడి నుంచి విడిపోయి విడాకులు తీసుకొని దూరంగా ఉంటుంది. కానీ పవన్ వల్ల ఆమె కెరియర్ పూర్తిగా ఆగిపోయింది అనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం. కేవలం నటించిన మొదటి సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడి అతని కోసమే తన సినిమాలను పక్కనపెట్టి తన జీవితాన్ని గడుపుతూ వచ్చింది. విడాకుల త‌ర్వాత రేణు వార్త‌ల్లో ఉన్నా కెరీర్ మాత్రం ఫుల్‌స్టాప్ అయిపోయింది.

సారిక :
కమల్ హాసన్ రెండవ భార్య సారిక. వీరిది సైతం ప్రేమ వివాహమే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం మొదలుపెట్టిన సారిక, యుక్త వయసు వచ్చాక కమల్ హాసన్ తో ప్రేమలో పడింది బాలీవుడ్‌లో సైతం సారిక చాలా మంచి స్థాయిలో ఉండగా కమల్ తో ప్రేమలో పడి ఇద్దరు పిల్లల్ని కన్నది. దాంతో ఆమె సినిమా జీవితం అక్కడితో ముగిసిపోయింది.

కమల్ తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా వరకు ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతం సినిమాలు లేక కుటుంబానికి దూరంగా ఎక్కడో మారుమూల పల్లెటూర్లో సారిక జీవిస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయం. ఓరకంగా కమల్ హాసన్ వల్లే ఆమె కెరియర్ నాశనం అయిందని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news