జనరల్ గా మన పెద్ద వాళ్ళు అంటుంటారు..తల్లిదండ్రులు చేసిన పాపాలు కానీ. పుణ్యాలు కానీ..వాళ్ళ బిడ్డలకు వస్తాయట. బహుశా ఈ హీరో కొడుకుల విషయం లో అదే నిజమే అనిపిస్తుంది. నటనలో టాలెంట్ ఉన్నా.. అవకాశాలు వస్తున్నా కానీ, కేవలం తండ్రి చేసిన తప్పు కారణంగా ఈ హీరోలు ఇండస్ట్రీలో జీరోలు అయ్యారు. మిగతా స్టార్ హీరో కొడుకుల సినిమాలు అంటే ధియేటర్స్ వద్ద రచ్చ రచ్చ చేసే అభిమానులు. ఈ హీరో కొడుకుల సినిమాలు అంటే మాత్రం..బుస్సు మని ఎగిరిపోతారు.
సినిమా రిలీజ్ అయిన ప్రతి సారి హగామా చేసుకోవడం..ఆ మూవీ ఫ్లాప్ అవ్వడం..దాని నెటిజన్స్ ట్రోల్ చేయడం..ఇదే అలవాటు అయిపోయింది. డబ్బుకు కి కొదవ లేని ఆ హీరో ..ఎంత పలుకబది ఉన్నా..తన బిడ్డలని ఇండస్ట్రీలో సెటిల్ చేయలేకపోయాడు. నేను కత్తి..నన్ను మించిన వాడు ఈ ఇండస్ట్రీలో లేడు అని పదే పదే డప్పు కొట్టుకునే ఆ హీరో ని ఇప్పుడు జనాలు పట్టించుకోవడమే మానేసారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆయన జీరో..ఆయన బిడ్డలు అంతే..
ఉన్నది ఒకటి ..చెప్పేది రెండు..అంత హంగామా బ్యాచ్ అనే పేరుకూడా ఉంది. దీనంతటి కారణం వాళ్ల తండ్రి. ఉన్న గొప్పలు లేని గొప్పలు చెప్పుకుని..ఇండస్ట్రీలో చీప్ అయిపోయాడు. ఒకప్పుడు ఆయన వస్తున్నాడు అంటేనే చేతులు ఎత్తి దండం పెట్టే వాళ్ళు..ఇప్పుడు కనీస మర్యాదలు కూడా ఇవ్వడం లేదు. ఎంత డబ్బున్న ఏం లాభం..మనిషి తన కాళ్ల మీద తాను నిలబడిలి కదా…అంటున్నారు జనాభ. ఓ రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఆయన శకం ముగిసిపోయిన్నట్లే..అని అంటున్నారు సినీ విశ్లేషకులు..!