సినిమాలకు, క్రికెటర్లకు ఉన్న లింక్ మనదేశంలో ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఈ రెండిటికి మనదేశంలో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. అందుకే చాలా మంది క్రికెటర్లు, హీరోయిన్లు రిలేషన్‌షిఫ్ మెయింటైన్ చేయడంతో పాటు సహజీవనాలు, ప్రేమలు, పెళ్లిళ్ల వరకు వెళ్లారు. గత కొన్ని దశాబ్దాల్లో క్రికెటర్లతో ప్రేమలో పడిన బాలీవుడ్ హీరోయిన్లు ఎవరు ? ఆ లిస్ట్ చూద్దాం.
1- సౌరవ్ గంగూలీ – నగ్మా :
అప్పట్లో స్టార్ హీరోయిన్ నగ్మా, భారత క్రికెట్‌జట్టులో స్టార్ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్న సౌరవ్ గంగూలీతో ప్రేమలో పడింది. 1999 వరల్డ్ కప్ సమయంలో వీరిద్దరులండన్ లో కలిసి ఉన్నారు. ఆ తర్వాత 2002లో వారిద్దరూ కాళహస్తిలో సర్పదోష నివారణ పూజ చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. తర్వాత భార్య డోనా పట్టుబట్టడంతో గంగూలీ నగ్మా రిలేషన్ బ్రేక్ అయ్యింది.
2- కపిల్ దేవ్ – సారిక :
1980 సమయంలో భారత కెప్టెన్ అయిన కపిల్ దేవ్, హీరోయిన్ సారిక మధ్య సహజీవనం వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. అన్నట్టు సారిక ఎవరో కాదు కమల్‌హాసన్ మాజీ భార్య. ప్రస్తుత హీరోయిన్ శృతీహాసన్‌కు స్వయానా అమ్మ.
3 -యువరాజ్ సింగ్ – కిమ్ శర్మ :
ఇండియన్ స్టార్ క్రికెటర్, తెలుగులో ఖడ్గం సినిమా హీరోయిన్ కిమ్‌శర్మ కూడా ప్రేమలో ఉన్నారు. చాలా రోజుల పాటు వీరు సహజీవనం చేశారు. కిమ్‌తో విడిపోయాక యువరాజ్ మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో కూడా ఎఫైర్ నడిపాడు. ఆ తర్వాత మరో నటినే యువరాజ్ పెళ్లాడాడు.
4 – రవి శాస్త్రి – అమృతా సింగ్ :
రవి శాస్త్రి, బాలీవుడ్ నటి అమృతా సింగ్ రిలేషన్ అప్పట్లో పెద్ద సెన్షేషన్. అమృత ఎవరో కాదు సైఫ్ ఆలీఖాన్ మాజీ భార్య. ప్రస్తుత నటి సోహా ఆలీఖాన్ తల్లి.
5 – మహేంద్ర సింగ్ ధోనీ – దీపిక పదుకొనే :
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ తన స్నేహితురాలు సాక్షిని పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే ముందు ధోనీ దీపికా పదుకొనేతో ఎఫైర్లో ఉన్నాడు. ఆ తర్వాత 2009లో రాయ్ లక్ష్మితో కూడా సహజీవనం చేశాడు. ఆ తర్వాత కపిల్ ప్రోగ్రాం ఫార్మర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్, హీరోయిన్ ఆశిన్‌తో కూడా డేటింగ్ చేశాడన్న రూమర్లు వచ్చాయి.
6 -కేఎల్ రాహుల్ – నిధి అగర్వాల్ :
రాహుల్, నిధి అగర్వాల్ రిలేన్పై కూడా చాలా వార్తలు వచ్చాయి. వీరు డేటింగ్ చేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. అయితే వీరు మాత్రం తమ మధ్య ఉన్నది స్నేహమే అని చెప్పారు.
7 – విరాట్ కోహ్లీ – ఇసబెల్లే లైట్ :
అనుష్కశర్మతో ప్రేమాయణం కంటే కోహ్లీ ఇసబెల్లేతో డేట్ చేసినట్టు ప్రచారం జరిగింది. తర్వాత అతడు అనుష్కతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
8-రిషబ్ పంత్ – ఇషా నేగి :
ప్రస్తుతం ఇండియన్ టీంలో డాషింగ్ క్రికెటర్‌గా ఉన్న రిషబ్ పంత్, హీరోయిన్ ఇషా నేగి తో రిలేషన్ షిప్ లో ఉన్నాడన్న వార్తలు బాగా హైలెట్ అయ్యాయి.
9 -జహీర్ ఖాన్ – ఈషా సర్వాణి :
భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ బౌలర్ జహీర్‌ఖాన్, ఈషా సర్వాణి 2005 టైంలో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో పాటు సహజీవనం కూడా చేశారు. అయితే 2013లో వీళ్ళిద్దరూ విడిపోయారు.