Moviesన‌గ్మాను హీరోయిన్ చేసేందుకు శ‌రీరంలోకి బ‌ల‌వంతంగా అవి ఎక్కించారా... ఇంత టార్చ‌రా...!

న‌గ్మాను హీరోయిన్ చేసేందుకు శ‌రీరంలోకి బ‌ల‌వంతంగా అవి ఎక్కించారా… ఇంత టార్చ‌రా…!

అలనాటి అందాల నటి నగ్మా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 1990వ దశంలో అరేబియన్ గుర్రం లాంటి నగ్మా అద్భుతమైన నటన, అందంతో అప్పట్లో నార్త్ నుంచి సౌత్ వరకు కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. నగ్మా అందం మాత్రమే కాదు.. అభినయంతోను, తన చిలిపి కళ్ళతోనూ ప్రేక్షకులను కట్టిపడేసేది. ముఖ్యంగా పొగరుబోతు పాత్రలకు నగ్మా పెట్టింది పేరు. అప్పట్లో తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి – నాగార్జున – బాలకృష్ణ – వెంకటేష్ – మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించి సూపర్ హిట్లు కొట్టింది. ఆ తర్వాత జనరేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అల్లరి రాముడు సినిమాలో అత్తగా నటించి అలరించింది. ముఖ్యంగా నగ్మా సినిమాలకంటే కూడా తన ఎఫైర్లతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా.. నలుగురు పెళ్లయిన వ్యక్తులతో ఎఫైర్లు పెట్టుకున్న నగ్మా అప్పట్లో సంచలన వార్తలతో నానుతూ ఉండేది. నగ్మా కెరీర్లో ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు కోలీవుడ్లో సీనియర్ హీరోగా ఉన్న శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపింది అప్పటికే శరత్ కుమార్‌కు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. శరత్ కుమార్ ప్రేమమైకంలో మునిగిపోయిన నగ్మా అతడు తనను పెళ్లి చేసుకుంటాడని గుడ్డిగా నమ్మేసింది. ఆ తర్వాత శరత్ తన భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో.. మోసపోయానని గ్రహించిన నగ్మా అప్పుడు ఇండియన్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ గా ఉన్న సౌరభ్‌ గంగూలీతో రిలేషన్ షిప్ లో ఉంది.

గంగూలీ నగ్మా కలిసి ఎక్కడ చూసినా చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగేవారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వారిద్దరూ జంటగా కూర్చుని రాహు, కేతు పూజలు చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒకానొక దశలో గంగూలీ – నగ్మాను పెళ్లి చేసుకునేందుకు తన భార్య డోనాకు విడాకులు కూడా ఇచ్చేస్తున్నాడు అన్న ప్రచారం జరిగింది. అయితే గంగూలీ కూడా భార్య డోనాను వదులుకునేందుకు ఇష్టపడకపోవడంతో… అతడికి దూరమైన నగ్మా ఆ తర్వాత భోజపురిలో అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న మనోజ్ తివారి – రవికిషన్ సింగ్ తో ప్రేమాయణాలు సాగించింది.

విచిత్రం ఏంటంటే రవికిషన్ – మనోజ్ తివారి ఇద్దరు కూడా స్నేహితులు. వారిద్దరూ నగ్మాను కావలసినట్టుగా వాడుకున్నారు అన్న రూమర్లు అప్పట్లో వినిపించాయి. ఇలా వరుసగా బ్రేకప్‌లతో విసిగిపోయిన నగ్మా ఇప్పుడు 50 ఏళ్లు దాటుతున్నా పెళ్ళికి దూరంగా ఉండిపోయింది. న‌గ్మా ఫ్యామిలీది రాజ‌రిక కుటుంబం. ఆమెది జైస‌ల్మేర్ రాజుల కుటుంబం. అయితే ఆమె పుట్టాక తల్లిదండ్రులు విడిపోవ‌డం.. త‌ల్లి మ‌రో పెళ్లి చేసుకోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డింది.

ఆమె అనేక ఇబ్బందులు ప‌డి హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమెకు 13 ఏళ్లు ఉన్న‌ప్పుడే హీరోయిన్‌ను చేసేందుకు శ‌రీరంలోకి బ‌ల‌వంతంగా హోర్మోన్లు ఎక్కించేవార‌ట‌. అప్పుడు ఆమె లావు అవ్వ‌డంతో పాటు హీరోయిన్ అయ్యేందుకు మంచి ఫిజిక్ వ‌చ్చింద‌ట‌. హోర్మోన్ల వ‌ల్లే న‌గ్మా చిన్న వ‌య‌స్సులోనే లావెక్కిపోయింద‌ని అంటారు. ఆమెను చిన్న‌ప్పుడే బ‌ల‌వంతంగా హీరోయిన్‌ను చేసేశార‌ని అంటారు. ఇక చిన్న వ‌య‌స్సులోనే క్రేజ్ రావ‌డంతో ఆమె చాలా మందిని న‌మ్మి స‌ర్వం కోల్పోయింది. ఇప్పుడు పెళ్లికి దూర‌మై త‌న వ్య‌క్తిగ‌త జీవితం కూడా కోల్పోయింది. ప్ర‌స్తుతం ఆమె కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news