Moviesఅనుష్కకు ఆమె హైట్‌కు త‌గ్గ టాలీవుడ్ హీరోతో అలా పెళ్లి ఫిక్స్...

అనుష్కకు ఆమె హైట్‌కు త‌గ్గ టాలీవుడ్ హీరోతో అలా పెళ్లి ఫిక్స్ చేశారా…!

టాలీవుడ్‌లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. సూపర్ సినిమాతో టాలీవుడ్‌కి నాగార్జున, దర్శకుడు పూరి జగన్నాథ్ పరిచయం చేశారు. అప్పటి నుంచి మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా కూడా ఎప్పుడు కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. పాత్ర కోసం ఎంతటి శ్రమ అయినా.. ఎలాంటి ఛాలెంజెస్ అయినా తీసుకోవడానికి అందరికంటే కూడా అనుష్క నాలుగు అడుగులు ముందే ఉంటుంది. అందుకే, హీరోలతో పాటు సమానంగా ఆమె క్రేజ్ తెచ్చుకుంది.

కమర్షియల్ సినిమాలలో మాత్రమే కాకుండా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌కు అనుష్క కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అరుంధతి తర్వాత అనుష్క కెరీర్ మరోలా టర్న్ తీసుకుంది. తన కోసమే కొత్త తరహా కథలు సిద్దమయ్యాయి. అలాంటి సినిమాలతో అనుష్క అటు రెమ్యూనరేషన్ పరంగా… ఇటు క్రేజ్‌ పరంగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలకు తావు ఇవ్వని అనుష్క గురించి మాత్రం ఏదో ఒక కాంట్రవర్సీ న్యూస్ క్రియేట్ అవుతూనే ఉంది.

ముఖ్యంగా ప్రభాస్ – అనుష్క పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో సందర్భాలలో అటు సోషల్ మీడియా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలలో వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రభాస్ అలాగే అనుష్క మా ఇద్దరి మధ్యన ఏమీ లేదని ఓపెన్ అయినా అది ఎవరూ అన్నమడం లేదు. దీనికి కారణం ఇంకా ఇద్దరూ పెళ్లి చేసుకోకపోవడమే. అయితే, ఒక దశలో మరో టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్‌తో కూడా అనుష్కకి లింక్ పెట్టారు.

గతంలో గోపీచంద్ – అనుష్క శెట్టి కలిసి లక్ష్యం, శౌర్యం సినిమాలను చేశారు. ఆ సమయంలో అనుష్క నా హైటుకి తగ్గ హీరో అంటూ కామెంట్స్ చేసింది. అంతే, అనుష్క‌కి సరైన జోడీ గోపీచంద్ అంటూ..వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు రాశారు. ఇలా కొన్నేళ్ల పాటు ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి గోపీచంద్ కి పెళ్ళి అయితేగానీ ఆ వార్తలు ఆగలేదు. అలా ఉంటుంది ఒక్క మాట మాట్లాడితే సినీ తారలెవరైనా.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news