టాలీవుడ్‌లో అక్కినేని, నందమూరి, దగ్గుబాటి ఫ్యామిలీలది ఐదారు దశాబ్దాల అనుబంధం. నందమూరి, అక్కినేని ఫ్యామిలీలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ బలమైన పునాదులు వేశారు. అదే దగ్గుబాటి ఫ్యామిలీకి మాత్రం లెజెండ్రీ ప్రొడ్యుసర్ రామానాయుడు బలమైన బీజం నాటారు. ఇండస్ట్రీలో ఈ ముగ్గురిది ఎంత బలమైన లెగసీయో తెలిసిందే. ఈ మూడు కుటుంబాల నుంచి మూడో తరం హీరోలు ఎంట్రీ ఇచ్చేశారు. అలాగే ఈ మూడు కుటుంబాల మధ్య అనుబంధం కూడా గొప్పదే. ఆ మాటకు వస్తే ఏఎన్నార్ – రామానాయుడు ఏకంగా వియ్యంకులే అయ్యారు.
ఇక ఇటు దగ్గుబాటి, నందమూరి, నందమూరి, అక్కినేని ఫ్యామిలీ బంధాలు కూడా బాగానే ఉంటాయి. ఇక నందమూరి, దగ్గుబాటి వంశాల్లో మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రానా కొనసాగుతున్నారు. వీరిద్దరిది వేర్వేరు స్టార్‌డమ్. బాహుబలితో రానా, త్రిబుల్ ఆర్‌తో ఎన్టీఆర్ నేషనల్ స్టార్ డమ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఇద్దరూ కూడా తాము హీరోలం అన్న ఈగోలకు ఎప్పుడూ పోరు.
ఇండస్ట్రీలో కొందరు హీరోలు, వారి అభిమానుల మధ్య ఎంత పొరాపొచ్చలు ఉన్నా రానా, ఎన్టీఆర్ సింపుల్‌గా, వాటికి దూరంగా ఉండడంతో పాటు తామేదో గొప్ప అన్న అహానికి ఎప్పుడూ పోరు. ఇక వ్యక్తిగతంగా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకుంటూ ఉంటారు. సురేష్‌బాబును ఎన్టీఆర్ ముద్దుగా మావా అని పిలుచుకుంటారు.
ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కు రామ్‌చరణ్ గెస్ట్ గా వచ్చాడు. ఫోన్ ఇన్ ఫ్రెండ్ కాల్‌కు చరణ్ రానాకే ఫోన్ చేశాడు. ఫోన్ కలిసిన వెంటనే రానా, ఎన్టీఆర్ ఒకరినొకరు బావ, బావ అని పిలుచుకున్నారు. బావ మీ ఎపిసోడ్ మేకింగ్ వీడియో ఏకంగా 10 సార్లు చూశానని.. తాను మెస్మరైజ్ అయిపోయానని చెప్పగా.. వెంటనే తారక్ థ్యాంక్యూ బావా అని రానాకు అప్యాయంగా చెప్పాడు. ఇక బయట కూడా రానా – ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఉంది.