Moviesసొంత బావ చేతిలోనే దారుణంగా మోస‌పోయిన అరియానా...! అలాంటి స్థితిలో చూసి...?

సొంత బావ చేతిలోనే దారుణంగా మోస‌పోయిన అరియానా…! అలాంటి స్థితిలో చూసి…?

టెలివిజ‌న్ రంగంలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. మొద‌ట హిందీలో స‌క్సెస్ అయిన ఈ షోను ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లోనూ ప్రారంభించి నిర్వాహ‌కులు స‌క్సెస్ అయ్యారు. ఇక తెలుగులోనూ బిగ్ బాస్ కు ఫ్యాన్స్ పెర‌గ‌టంతో వ‌రుస సీజ‌న్ల‌తో షో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ వ‌ల్ల అప్ప‌టికే ఫేమ్ ఉన్న సెల‌బ్రెటీల‌కు న‌ష్టం జ‌రిగితే ఎలాంటి పాపులారిటీ లేని సెల‌బ్రెటీల‌కు మాత్రం ఎంతో లాభం జ‌రుగుంది. అప్ప‌టికే పాపులారిటీ ఉన్న‌వాళ్ల‌కు బిగ్ బాస్ త‌ర‌వాత అవకాశాలు త‌గ్గ‌టం చూశాం.

కానీ ఎలాంటి పాపులారిటి లేని వారికి క్రేజ్ వ‌చ్చి ఆ త‌ర్వాత టీవీలో బిజీ అయిన‌వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి లిస్ట్ లోనే యాంక‌ర్ అరియానా గ్లోరీ కూడా ఉంటారు. నిజానికి అరియానా గ్లోరీ జెమిని టీవీలో ఓ సీరియ‌ల్ న‌టించ‌డంతో పాటూ ఆర్జీవీతో ఓ ఇంట‌ర్వ్యూ చేసి ఫేమ‌స్ అయ్యింది. అలా బిగ్ బాస్ అవ‌కాశాన్ని అందుకుంది. ఆ త‌ర‌వాత అమ్మాయిలే బిగ్ బాస్ టైటిల్ గెల‌వాలి అని చెబుతూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ను సంపాదించుకుంది. చివ‌ర‌కి క‌ప్ కొట్ట‌క‌పోయినా టాప్ 5లో నిలిచి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

బిగ్ బాస్ త‌ర‌వాత అరియానా టీవీ షోల‌తో పాటూ సినిమా ఆఫ‌ర్ల‌ను అందుకుంది. కానీ అంత‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. అరియానా ఇటీవ‌ల ప్ర‌సార‌మైన ఓటీటీ బిగ్ బాస్ లోనూ సంద‌డి చేసింది. కాగా ఓటీటీ బిగ్ బాస్‌లో ఓ సంధ‌ర్బంలో త‌న ల‌వ్ బ్రేక‌ప్ గురించి చెబుతూ బాధ‌ప‌డింది. తాను చిన్న‌త‌నంలోనే తండ్రి ప్రేమకు దూర‌మ‌య్యాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దాంతో తొమ్మిదో త‌ర‌గ‌తిలోనే త‌న బావ‌తో ల‌వ్ మొద‌లైంద‌ని చెప్పింది.

బావ చూపించే కేరింగ్ ప్రేమ చూసి అత‌డి పై ల‌వ్ మ‌రింత ఎక్కువైపోయింద‌ని చెప్పింది. త‌న బావ‌కు డిగ్రీ కంప్లీట్ చేసిన త‌ర‌వాత హైద‌ర‌బాద్ లో ఉద్యోగం వ‌చ్చింద‌ని దాంతో తామిద్ద‌రం హైద‌ర‌బాద్ లోనే క‌లిసి ఉన్నామని తెలిపింది. మూడు సంవ్స‌రాలు బాగేనే గ‌డిచాయ‌ని కానీ ఆ త‌ర‌వాత త‌న బావ‌కు తాను బోర్ కొట్టేశాన‌ని అర్థం అయ్యింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ విష‌యం తాను లేట్ గా తెలుసుకున్నాన‌ని చెప్పింది. ఓ రోజు త‌న బావ‌ను చూడ‌కూడ‌ని స్థితో చూశాన‌ని.. కానీ అత‌డు స‌ర్దిచెప్ప‌డంతో క‌న్విన్స్ అయ్యాన‌ని తెలిపింది.

ఆ త‌ర‌వాత కూడా త‌న బావ‌తో రెండేళ్లు ఉన్నాన‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో త‌న‌తో ఓ అబ్బాయి క్లోజ్ గా మాట్లాడ‌టం చూసి త‌న బావ గొడ‌వ పెట్టుకుని వ‌దిలించుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ త‌ర‌వాత కూడా త‌న బావ గుర్తుకు వ‌చ్చాడని తెలిపింది. ఎంత బ‌తిమాలినా కూడా అత‌డు విన‌లేద‌ని బోల్డ్ బ్యూటీ క‌న్నీళ్లు పెట్టుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news