Moviesపెళ్లై కొడుకు ఉన్న మ‌హిళ‌నే బ్ర‌హ్మాజీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..? ఇంట్ర‌స్టింగ్...

పెళ్లై కొడుకు ఉన్న మ‌హిళ‌నే బ్ర‌హ్మాజీ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు..? ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ..!

టాలీవుడ్ లో బిజీగా ఉండే న‌టుల‌లో బ్ర‌హ్మాజీ కూడా ఒక‌రు. వ‌రుస సినిమాల‌తో బ్ర‌హ్మాజీ ఫుల్ బిజీగా ఉంటారు. కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గులాబీ సినిమాతో బ్ర‌హ్మాజీ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యారు. అంతే కాకుండా ఆ త‌ర్వాత కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలోనే నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో న‌టించారు. ఈ సినిమాతో న‌టుడుగా బ్ర‌హ్మాజీకి మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత‌ మ‌ళ్లీ కృష్ణ వంశీ డైరెక్ష‌న్ లోనే బ్ర‌హ్మాజీ సింధూరం సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

సీరియ‌స్ పాత్ర‌లతో పాటూ కామెడీ పాత్ర‌ల్లోనూ బ్ర‌హ్మాజీ అద‌ర‌గొడుతూ ఉంటారు. అంతే కాకుండా ఎక్కువ‌గా బ్ర‌హ్మాజీ పోలీస్ పాత్ర‌ల‌లో న‌టిస్తూ కనిపిస్తుంటారు. రీసెంట్ గా వ‌చ్చిన డీజే టిల్లు సినిమాలో కూడా పోలీస్ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. టాలీవుడ్ లోని సీనియ‌ర్ హీరోల‌తో పాటూ జూనియ‌ర్ హీరోల‌తో కూడా న‌టీన‌టుల‌తో బ్ర‌హ్మాజీ చాలా క్లోజ్ గా ఉంటారు. సోషల్ మీడియాలోనూ చ‌లాకీగా కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే సినిమాల్లో ఎంతో స‌క్సెస్ అయిన బ్ర‌హ్మాజీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 

బ్ర‌హ్మాజీ అప్ప‌టికే పెళ్లైన మ‌హిళ‌ను వివాహం చేసుకున్నారు. బ్ర‌హ్మాజీ కెరీర్‌లో అప్పుడ‌ప్పుడే నిల‌దొక్కు కుంటోన్న టైంలో చెన్నైలో ఉండేవాడు. ఆ సమ‌యంలో బ్ర‌హ్మాజీకి బెంగాలి యువ‌తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే అప్ప‌టికే ఆ యువితికి వివాహం జ‌ర‌గ్గా ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న ఆ మ‌హిళ‌తో బ్ర‌హ్మాజీ ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. ఆ త‌ర‌వాత వారిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.

 

అంతే కాకుండా ఆ పెళ్లికి బ్ర‌హ్మాజీ ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది. అయితే అప్ప‌టికే తాను పెళ్లి చేసుకున్న మ‌హిళ‌కు కుమారుడు ఉండ‌టంతో తాను పిల్ల‌ల‌ను వ‌ద్ద‌నుకున్నాన‌ని బ్ర‌హ్మాజీ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఇక కుమారుడికి బ్ర‌హ్మాజీ ద‌గ్గ‌రుండి వివాహం జ‌రిపించారు. అంతే కాకుండా టాలీవుడ్ లో హీరోగా ప‌రిచ‌యం చేశారు. మ‌రి ఇంత ఆద‌ర్శ‌వంత‌మైన వివాహం చేసుకున్న బ్ర‌హ్మాజీకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news