నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బాలయ్య తాజాగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే సినిమాలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య కి జోడిగా ప్రియమణి పేరు వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురు పాత్రలో కనిపిస్తోంది. బాలయ్య ఈ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు.
ఇక గతంలో బాలయ్య నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఇండస్ట్రీ రికార్డులు.. ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశాయి. ఆయన నటించిన పౌరాణిక సినిమా భైరవద్వీపం అప్పట్లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా సెన్సార్ బోర్డుకు కూడా షాక్ ఇచ్చింది. అప్పట్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేని సమయంలో కూడా భైరవద్వీపం సినిమాను చాలా అద్భుతంగా మలిచారు.
విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు ఒక్క సెన్సార్ కట్ లేకుండా రిలీజ్ చేశారట. సెన్సార్ పూర్తయిన తర్వాత సెన్సార్ వాళ్ళు సూచనలు చేశారట. ఈ సినిమా సెన్సార్ అయ్యాక గుర్రాలు కింద పడిపోయిన షార్ట్స్ మా వరకు ఎలాంటి అభ్యంతరం లేదు… కానీ వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ సీన్లు ఎడిటింగ్లో తొలగించాల్సి వస్తుందని చెప్పారట. అయితే ఆ సీన్లు వారి దృష్టిలో పడలేదు దీనిపై వన్యప్రాణి సంరక్షణ విభాగం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
సినిమాలో గుర్రాలు పరిగెత్తేటప్పుడు వాటి కాళ్లకు అడ్డంగా వైర్లు కడతారు. ఆ వైర్లు తగలగానే గుర్రాలు కింద పడిపోతాయి. అలాంటప్పుడు వాటి కాళ్లు కూడా విరిగేప్రమాదం ఉంది. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న సన్నివేశం. ఆ సీన్ పూర్తయిన వెంటనే గుర్రాలను అక్కడే ఉన్న వైద్యుడికి చూపించి చికిత్స చేయించారంట. అలా ఈ సీన్లు షూట్ చేసేందుకు దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించగా… ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా అప్పట్లో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.