ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్లు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని..త్వరగా పిల్లల్ని కనేస్తునారు. రీజన్ ఏంటో తెలియదు కానీ..స్టార్స్ అయితే, కూసింత తొందరగానే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక వాళ్ళ పెళ్లి తంతు మొదలైనప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు ప్రతి ది ఓ మెమోరీగా ఫోటో షూట్ రూపంలో పదిలంగా దాచుకొవడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే బేబీ బంప్ తో ఫోటో షూట్లకి రకరకాల ఫోజులిస్తూ..నెట్టింట ట్రెండ్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ప్రెగ్నెన్సీ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. ఇన్నాళ్ళు ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చినా ఏ నాడు స్పందించలేదు. కానీ, కొద్ది సేప్పటి క్రితమే అధికారికంగా బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్..తమ మొదటి బిడ్డ ను అధికారికంగా ప్రకటించారు. కరణ్ సింగ్ గ్రోవర్ భార్య బిపాసా బేబీ బంప్పై ప్రేమగా ముద్దుపెడుతూ తన ఆనందాన్ని పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
బిపాషా బసు ఇన్స్టాగ్రామ్లో ఓ ఎమోషనల్ నోట్ కూడా పోస్ట్ చేసింది. ” నాకు ఇది ఓ కొత్త సమయం, కొత్త ఫీలింగ్. మా జీవితంలోకి మరో కొత్త వ్యక్తి ..మరింత సంతోషం గా ఉంది.. మేము ఇద్దరం కాస్త ముగ్గురు కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ రాబోతుంది.. ఈ విషయం మీకు చెప్పడానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం”..అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దీంతో బిపాసా ప్రెగ్నేన్సీ పిక్స్ వైరల్ గా మారాయి.