టాలీవుడ్ లో ఒకే వారం రెండు సినిమాలు రిలీజ్ అవ్వటం మామూలు విషయమే. గతంలో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకటి ఎక్కువ.. ఒకటి కాస్త తక్కువ అంచనాలతో రిలీజ్ అవ్వటం జరుగుతూ వస్తోంది. అయితే అందుకు భిన్నంగా ఈ వారం విడుదలవుతున్న రెండు సినిమాలు పోట్ల గిత్తల మాదిరిగా థియేటర్ల దగ్గర కుమ్మేయటానికి రెడీ అయిపోయాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కాదు… ఏ సినిమా తక్కువ కాదు అన్నట్టుగా ఉంది. సీతారామం బింబిసారా రెండు కూడా నామవాచకాలే.
ఇక రిలీజ్ కి ముందు రెండు సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధించింది.. అన్నది ఓసారి చూస్తే రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటా పోటీగా తలపడుతున్న వాతావరణమే ఉంది. ముందుగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మాస్ సినిమాగా రిలీజ్ అవుతుంటే.. సీతారామం క్లాసు సినిమాగా వస్తోంది. బింబిసార సినిమాకు కొమరం పులి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తే… సీతారామం సినిమాకు బాహుబలి ప్రభాస్ గెస్ట్ గా రావడంతో రెండు సినిమాలకు మంచి హైప్ వచ్చింది.
ఏ సెంటర్లలో, క్లాస్ సెంటర్లలో సీతారామంకు అడ్వాన్స్ బుకింగ్‌లు బాగా నడుస్తున్నాయి. బి, సి సెంటర్లలో బింబిసారా సినిమా టికెట్లు బాగా తెగుతున్నాయి. పోనీ ప్రి రిలీజ్ బిజినెస్‌ను కంపేరిజన్ చేసి ఎవరు పై చేయి సాధించారో చూడాలన్నా రెండు సినిమాలకు దాదాపుగా ఒకేలా బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్‌గా బింబిసారకు రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం 4 – సీడెడ్ 2.5 – ఆంధ్రా 6.5 – రెస్టాఫ్ ఇండియా 1 కోటి – ఓవర్సీస్ 1 కోటికి ఈ సినిమాను అమ్మారు. ఏపీ, తెలంగాణ రైట్స్ దిల్ రాజు తీసేసుకున్నారు.
ఇక సీతారామం వైజయంతీ బ్యానర్లో వస్తుండడంతో ఈ సినిమాకు కూడా మంచి థియేటర్లు, ఎగ్జిబిటర్లే దొరికారు. ఈ సిసిమాకు దుల్కర్ సల్మాన్ ఖన్నా, వైజయంతీ బ్యానర్ బ్యాకప్, రష్మిక ప్లస్ అవుతున్నారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం 4 – సీడెడ్ 2 – ఆంధ్రా 6 – రెస్టాఫ్ ఇండియా 1 కోటి – ఓవర్సీస్ 1 కోటితో రు. 14 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.
ఫైనల్‌గా చూస్తే రెండు సినిమాలు మంచి బ్యానర్లలోనే తెరకెక్కాయి. ఒకే బడ్జెట్.. సమానమైన ప్రి రిలీజ్ బిజినెస్… థియేటర్లు కూడా ఒకేలా దక్కాయి. కాకపోతే ఒకటి క్లాస్‌లో అంచనాలతో వస్తుంటే.. మరొకటి మాస్లో హైప్‌తో వస్తోంది. మరి ఈ రెండు సినిమాలలో ఏది పై చేయి సాధిస్తుందో ? చూడాలి.