నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చాలా రోజుల తరువాత మూవీ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు వశిష్ట్ మల్లిడి తెరకెక్కించిన ఈ సోషియా ఫాంటసీ బ్యాక్‌డ్రాప్ మూవీకి టైమ్ ట్రావెల్ నేపథ్యం కూడా యాడ్ అవ్వడం, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తి రేపడం, ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్లలో కీలకంగా ఉండడం.. పైగా ప్రివ్యూ షోలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో కళ్యాణ్‌రామ్ గత సినిమాలకు ఎప్పుడూ లేనం పాజిటివ్ వైబ్స్ బింబిసారకు వచ్చాయి.
కళ్యాణ్‌రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై ఆయన బావమరిది హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా కథ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం త్రిగర్తల సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుందని.. ఆ సామ్రాజ్యానికి రాజుగా కళ్యాణ్‌రామ్ అద్భుతంగా నటించాడని సినిమా చూసిన వాళ్లు చెపుతున్నారు.
బింబిసారుడు తన సామ్రాజ్య నిధిని ఎలా కాపాడుకున్నాడు ? అన్నది చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుందట. ఫస్టాఫ్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని.. విజువల్ వండర్‌లా తెరకెక్కించారని కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్ వర్క్ అయితే మెస్మరైజ్ చేసేలా ఉందట. జూనియర్ ఎన్టీఆర్ ముందు నుంచే కాన్ఫిడెంట్‌గా చెప్పినట్టు బింబిసారుడి పాత్ర కళ్యాణ్‌రామ్ తప్పా ఎవ్వరూ చేయలేరనే తెలుస్తోంది.
కళ్యాణ్‌రామ్ వన్ మ్యాన్ షోగా సినిమా అంతా తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపించాడట. మనలను ఈ సినిమా మరో ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని.. స్టోరీ సూపర్బ్‌గా ఉంటే, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్‌లో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడంతో నందమూరి అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. పూర్తి రివ్యూతో బింబిసార రేంజ్ ఏంటో కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.