నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ బింబిసార దూకుడు 5వ రోజు కూడా స్ట్రాంగ్‌గానే కంటిన్యూ అయ్యింది. 5వ రోజు మెహర్రం పండగ రావడం.. సెలవు దినం కావడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది. అందుకే 5వ రోజు కూడా ఏపీ, తెలంగాణలో ఈ సినిమా రు 2.52 కోట్ల షేర్ కొల్లగొట్టింది. విచిత్రం ఏంటంటే నాలుగో రోజు సోమవారంతో పోలిస్తే ఐదో రోజు వసూళ్లు పెరిగాయి.
బాక్సాఫీస్ దగ్గర సందడి మరింతగా కనిపించింది. ఏ సెంటర్లలో సీతారామం హడావిడి కనిపిస్తుంటే బీ, సీ సెంటర్లలో బింబిసార దూసుకుపోతోంది. ఇక కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఇప్పటికే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 14 – 15 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే కాస్త అటూ ఇటూగా రు. 21 కోట్ల షేర్ రాబట్టడంతో బయ్యర్లు, నిర్మాతలు అందరూ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాటలోకి వెళ్లిపోయారు.
దీంతో ఇప్పుడు ఇండస్ట్రీకి, ఎంత పెద్ద హీరోకు అయినా ఇలాంటి హిట్ సినిమా కావాలన్న చర్చలే నడుస్తున్నాయి. అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో ఇటు నిర్మాతకు కూడా ఓవర్ ప్లో పెరిగి భారీ లాభాలు రానున్నాయి. బింబిసార 5 వ రోజు ఏపీ, తెలంగాణ వసూళ్లు ఇలా ఉన్నాయి..
బింబిసార 5వ రోజు వసూళ్లు ..
నైజాం – 89 లక్షలు
వైజాగ్ – 37 లక్షలు
సీడెడ్ – 62 లక్షలు
కృష్ణా – 14 లక్షలు
గుంటూరు – 17 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు
ఈస్ట్ – 15 లక్షలు
వెస్ట్ – 11 లక్షలు
—————————————–
టోటల్ 5 వ రోజు షేర్ = 2.52 కోట్లు
—————————————–
ఏపీ + తెలంగాణ 5 రోజుల షేర్ = 20.70 కోట్లు