టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే..టైం బాగోలేదా..అంటే అవుననే చెప్పాలి. వరుసగా ఫ్లాప్ సినిమాలు పడటం..ఆ తరువాత వరుస కమిట్ అయిన సినిమాలని నుండి బ్యాక్ రావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇన్నాళ్ళు టాలీవుడ్ జనాలు పూజా ను ఓ దేవతలా చూసారు. కానీ, ఇప్పుడు అందరు తిట్టుకుంటున్నారు. అందుకు కారణం ఆమె మన టాలీవుడ్ హీరోలను తక్కువగా చూడటమే. యస్..ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
నిజానికి బుట్టబొమ్మ కెరీర్ చాలా అప్ అండ్ డౌన్స్ మధ్య నలిగిపోయింది. ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడింది . ఎట్టకేలకు హిట్ కొట్టిన పూజా..ఇప్పుడు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కే చుక్కలు చూయిస్తుంది. మనకు తెలిసిందే పూజా ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..మూడు బాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది. సినిమాలు ఫ్లాప్ అయినా..అమ్మడు అందాల ప్రదర్శన మాత్రం ఫ్లాప్ కాలేదు. దింతో డైరెక్టర్స్ అమ్మదుకి పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు.
అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఇలాంటి టైంలో పూజా పవన్ హరిహర వీరమల్లు సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇప్పుడు లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ కే హ్యాండ్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. మహేశ్ బాబు తో తన నెక్స్ట్ సినిమాను హీరోయిన్ గా అనుకున్న పూజా హెగ్డే..ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం లేకపోనులేదు. ప్రజెంట్ టాలీవుడ్ లో ఎలాంటి పరిస్ధితులు ఉన్నాయో తెలిసిందే.
షూటింగ్ లు ఆగిపోయాయి. ఎప్పుడు మొదలు అవుతాయో తెలీయదు. స్టార్ట్ అయిన మహేశ్ అప్పుడు షూట్ కి వస్తారో కూడా అంచనా వేయలేం..ఇలాంటి టైంలో బాలీవుడ్ కి కమిట్ అయిన సినిమాలు లేట్ అవుతున్న కారణంగా పూజా ఈ సినిమా నుండి తప్పుకుందట. అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసిందట. ఇది నిజంగా మహేశ్ అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి.