అక్కినేని నాగార్జున.. ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. చెప్పే కొద్ది ఇంకా ఏదో చెప్పాలి అనిపించే విధంగా.. వినే కొద్ది ఇంకా వినాలి అనిపించే అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈయన స్టోరి. అంతటి రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈ నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగార్జున ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసాడు . అంతేకాదు సరైన సమయంలో ఇండస్ట్రీలో హిట్స్ లేక అల్లాడిపోతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నాగార్జున ఇచ్చిన సహాయం.. ఆయన చేసిన సినిమాల ద్వారా వచ్చిన హిట్స్ ఎంతో హెల్ప్ చేశాయనే చెప్పాలి.
కాగా నేడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీస్ అందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అభిమానులతో పాటు స్టార్ సెలబ్రిటీస్, బుల్లితెర నటులు ,సామాన్య ప్రజలు.. అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళందరిలోకి వరస్ట్ గా నిలిచింది బుల్లితెర బ్యూటీ ఆశు రెడ్డి విషెస్. ఆషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. జూనియర్ సమంత గా సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత బిగ్ బాస్ షో కి ఎంటర్ అయ్యి తన పాపులారిటీని డబుల్ చేసుకుంది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆషు రెడ్డి చేసిన హంగామా అంతా అంతా కాదు. నిరంతరం తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కాగా రీసెంట్ గా.. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ అక్కినేని అభిమానులకు కోపం తెప్పిస్తుంది. 63 ఏళ్ల ఓ సీనియర్ హీరోకి ఆమె ఇచ్చే గౌరవం ఇదేనా..? ఈ విధంగా బర్త డే విషెస్ చెప్తారా..? అంటూ మండిపడుతున్నారు. ఇంతకు ఆషు రెడ్డి ఏం చెప్పిందో తెలుసా,,?
” నాగార్జునను గట్టిగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..” హలో మన్మధుడు ..మీకు చాలా ముద్దులు.. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను సార్” అంటూ కామెంట్ పెట్టింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఆషు రెడ్డి ఇలా పోస్ట్ చేయడంపై అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బుద్ధుందా అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆశు రెడ్డి నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.
View this post on Instagram