బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ – ఆంటీ మలైకా ఆరోరా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ సినిమాల కంటే డేటింగ్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. సినిమా హీరోలు – హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం కొత్త కాదు. అయితే అందరి ప్రేమకు డేటింగ్లకు భిన్నంగా మలైకా, అర్జున్ కపూర్ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. వయసులో అర్జున్ కంటే మలైకా పదేళ్లకు పైగా పెద్దది.
పైగా ఇప్పటివరకు అర్జున్ కు పెళ్లి కూడా కాలేదు. అతడికి మంచి కెరీర్ ఉంది. తనకంటే పదేళ్లకు పైగా పెద్దది అయినా ఆంటీతో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో పాటు… పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తూ కెరీర్ పై సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అర్జున్. ఈ విషయమై అర్జున్ కపూర్ తండ్రి బోనికపూర్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా అర్జున్ తన పంథాను మాత్రం మార్చుకోవటం లేదు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు అయితే మలైకాతో అర్జున ప్రేమలో పడ్డాడో అప్పటినుంచి అర్జున్ కెరీర్ పూర్తిగా మందగించింది.
ఇక మలైకా కూడా తన భర్తకు విడాకులు ఇవ్వడంతో పాటు ఇద్దరు పిల్లలను కూడా పూర్తిగా వదిలేసింది. ఇప్పుడు పూర్తిగా అర్జున్ మాయలో పడిపోయింది. ఈ క్రమంలోనే గత రెండు నెలలుగా అర్జున్ – మలైకా పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అర్జున్ స్పందించాడు. పాపులర్ షో కాఫీ విత్ కరణ్ షోకు గెస్ట్ గా వచ్చిన అర్జున్ కపూర్ మలైకాతో పెళ్లి గురించి మాట్లాడుతూ… తాను ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేనని… కోవిడ్ వల్ల రెండు సంవత్సరాలుగా సినిమాలు లేక తన సమయం గడిచిపోయిందని… దీంతో ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపాడు అర్జున్ కపూర్.
మలైకాను తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పడాన్ని బట్టి చూస్తే కొద్ది రోజులపాటు వీరిద్దరూ ఎంజాయ్ చేసేందుకే ఇష్టంతో ఉన్నారని… అర్జున్ కపూర్ కు మలైకాను పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదన్న వార్తలు కూడా బాలీవుడ్ మీడియా ప్రచురిస్తోంది. తాను సంతోషంగా ఉంటేనే తన భాగస్వామిని కూడా సంతోష పెడతానని… ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేవని అర్జున్ చెప్పాడు. ఏదేమైనా ఈ కామెంట్లు చూసినవాళ్లు అర్జున్- మలైకా బ్రేకప్ ఎంతో దూరంలో లేదని చెబుతున్నారు.