Moviesఅనుష్క పెళ్లి మ్యాట‌ర్‌... ఏదో తేడా కొడుతోంది... అందుకే అలా చేస్తోందా..!

అనుష్క పెళ్లి మ్యాట‌ర్‌… ఏదో తేడా కొడుతోంది… అందుకే అలా చేస్తోందా..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా ? అన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. గత మూడు సంవత్సరాలుగా అనుష్క పెళ్లిపై వార్తలు వస్తున్నా ఆమె మాత్రం సైలెంట్ గా ఉంటుంది. బాహుబలి 2 సినిమా పూర్తి అయిన వెంటనే అనుష్క పెళ్లి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించిన అనుష్క కరోనా సమయంలో సీనియర్ హీరోయిన్లు, హీరోలు అందరూ పెళ్లి చేసుకున్నా ఆమె మాత్రం సైలెంట్‌గానే ఉంది. ఇప్పుడు కరోనా ముగిసింది.. తిరిగి షూటింగ్‌లు నడుస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఆమె నవీన్ పోలిశెట్టికి జోడిగా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. విచిత్రమేంటంటే నవీన్ కంటే వయసులో చాలా పెద్దది అయినా అనుష్క అతనితో జోడి కడుతుంది. ఈ సినిమాను ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా క‌థ‌, కథనాలు చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. అసలు అనుష్క ఈ సినిమా చేయటానికి ప్రధాన కారణం కూడా ప్రభాస్ రికమెండ్ చేయటం వల్లే అని అంటున్నారు.

ఇప్పటికే అనుష్క వయసు 40 సంవత్సరాలకు చేరువ అవుతోంది: ఈ టైంలో కూడా ఆమె సినిమాలు ఒప్పుకోవడం చూస్తే అసలు ఆమెకి ఇప్పట్లో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి లేద‌న్న గుస‌గుస‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఒకటి మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఆమె ఇప్పుడు నవీన్ పోలిశెట్టి సినిమా ఒప్పుకోవడంతోనే మరికొద్ది రోజులు సినిమాల్లో కంటిన్యూ అయ్యేందుకు ఆసక్తితో ఉందని అర్థమవుతుంది.

అయితే ఈ సినిమా వెనకాల ప్రభాస్ ఉండటమే పలు సందేహాలకు తావిస్తోంది. గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రభాస్ – అనుష్క పెళ్లిపై చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ప్రభాస్‌కు పెళ్లి కాలేదు. ఇటు అనుష్కను ఇంకా హీరోయిన్‌గా ప్రమోట్ చేస్తూనే ఉన్నాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య‌ అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. అనుష్క పెళ్లి… ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news