సినీ ఇండస్ట్రీలో డేటింగ్స్,, ప్రేమలు, పెళ్లిలు, విడాకులు, అఫైర్లు చాలా కామన్. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న జంటలకంటే ..ప్రేమించి పెళ్లి చేసుకొని.. మరొకరితో ఎఫైర్ నడిపే జంటల సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు ,కోలీవుడ్ కాదు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇలాంటివి సర్వసాధారణం. కాగా రీసెంట్ టైంలో ఇలాంటి ఓ ఎఫైర్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వాళ్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్, టాలీవుడ్ సీనియర్ హీరో నరేష్ డేటింగ్ మ్యాటర్.
మనకు తెలిసిందే ఆల్రెడీ నరేష్ కి మూడు పెళ్లిలు చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు అంటే మాటలా..? ఈరోజుల్లో ఒక పెళ్లి చేసుకోవడానికి అల్లాడిపోతున్నారు కుర్రాళ్ళు. మరి అలాంటిది ఈయన మాత్రం మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి డైవర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఇద్దరికీ డైవర్స్ ఇచ్చి మూడో భార్యకి డైవర్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంతేనా నాలుగో పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ సంచలనానికి తెర లేపాడూ. సినీ ఇండస్ట్రీలో తన నటనతో మెప్పించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ తో డేటింగ్ అంటూ అఫీషియల్ గా ప్రకటించి సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారారు.
గత కొన్ని నెలలుగా వీళ్లకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు తెలిసిందే. రీసెంట్ గా పవిత్ర లోకేష్ సినిమా షూటింగ్ కు వెళ్తే అక్కడ ఓ స్టార్ హీరో ఆమెపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఇండస్ట్రీలో పవిత్ర లోకేష్ లాగే మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా సీనియర్ హీరోని పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునేది కోలీవుడ్ సీనియర్ హీరోని అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. అమ్మ ,వదిన ,పక్కింటి ఆంటీ ..క్యారెక్టర్లతో మెప్పించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ..ఇప్పుడు కోలీవుడ్ సీనియర్ హీరోని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో కొందరు ఆర్టిస్టులు చేస్తున్న పని వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు పోతుంది అంటున్నారు మిగతా సినీ నటులు. చూడాలి ఇండస్ట్రీలో మరెంత మంది పవిత లోఖేష్ లు ఉన్నారో..?