ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే అంశం హాట్ టాపిక్ గా మారింది. అనసూయ ఆంటీ.. అనసూయ ఆంటీ.. అనసూయ ఆంటీ.. ఇప్పుడు ఇదే పేరు నెట్టింట ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అఫ్ కోర్స్.. ఫస్ట్ నుంచి అనసూయ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అనసూయ నెట్టింట నెగిటీవ్ ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం ఆమె విజయ్ దేవరకొండ సినిమాపై పరోక్షకంగా చేసిన ట్వీటే.
తప్పో ఒప్పో అనసూయ పొరపాటున ఒక మాట అనేసింది. దీంతో అనసూయను ఆ హీరో ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ ఆంటీ అంటూ లైగర్ సినిమా రిలీజ్ అయిన నాడు నుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. అయితే అసలు ఈ విషయంలో తప్పు ఎవరిది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోల్ రన్ అవుతుంది.
సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ ఆధారంగా అసలు తప్పు ఎవరిది అంటే అందరూ అనసూయ అంటూ మండిపడుతున్నారు. సినీ ఇండస్ట్రీ అన్నాక అణుకువగా.. ఓర్పుగా.. సహనం తో ఉండాలని అంత పెద్ద యాంకర్ పొజిషన్ లో ఉన్న అనసూయ హీరో సినిమా ఫ్లాప్ అయితే సంబరపడటం.. సోషల్ మీడియాలో అందరికీ అర్థమయ్యేలా పరోక్షకంగా పెట్టడం తప్పని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే గతంలో అనసూయ విజయ దేవరకొండ మధ్య జరిగిన వార్ సంగతి మనకు తెలిసిందే.
అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన క్యారెక్టర్ చెప్పిన ఓ డైలాగ్ అనసూయ కి విజయ్ దేవరకొండ కి మధ్య పెద్దవార్ జరిగేలా చేసింది. ఆ మేటర్ అప్పట్లో సంచలనం లేపింది. ఆ గొడవ అంతటితో సర్దుమనిగిందిలే అనుకుంటే.. మళ్లీ లైగర్ సినిమా రిలీజ్ తర్వాత అనసూయ ఘాటైన ట్విట్ చేస్తూ పరోక్షకంగా విజయ్ ని విమర్శించడమే ఆమె చేసిన తప్పు” అంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. లైగర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల కి ఆమె సోషల్ మీడియా వేదికగా “కర్మ రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్క”.. అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు అనసూయను ఆంటీ అని పచ్చి బూతులు తిట్టేలాగా ట్రోలింగ్ కి గురి అయ్యేలా చేసింది. దీంతో ఫస్ట్ నుంచి అందరూ అనసూయ ఆ మాట అనకుండా ఉంటే విజయ్ దేవరకొండ అభిమానులకు కోపం వచ్చేది కాదని.. ఇంతటి ట్రోలింగ్ జరిగేది కాదని అంటున్నారు. చాలామంది ఈ విషయంలో యాంకర్ అనసూయదే తప్పు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. నిజానికి అనసూయ ఆ ట్వీట్ చేయకుండా ఉంటే.. ఇప్పుడు ఇంత గోల అయ్యేది కాదనేది సినీ ప్రముఖుల అభిప్రాయం. మరి చూడాలి ఈ వార్ ఎప్పటికి ఎండ్ అవుతుందో..?