మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోల లీగ్ లో ఉన్నాడు. అల్లు అరవింద్ తనయుడుగా గంగోత్రి సినిమాతో తీరుగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు, ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పటికే కేరళతో పాటు నార్త్ లో తిరుగులేని క్రేజీ సొంతం చేసుకున్న బన్నీ… పుష్పసినిమాతో ఏకంగా బాలీవుడ్ లోనూ పాగా వేశాడు.
ఇక అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అన్న బన్నీతో పోల్చుకుంటే అంత స్టార్ హీరో కాకపోయినా… కొన్ని హిట్ సినిమాలు… కొన్ని ప్లాప్ సినిమాల్లో నటించాడు. అయితే గంతకాలంగా శిరీష్ సినిమాలకు ఎందుకో గాని దూరంగా ఉంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో శిరీష్ చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. అలాంటి శిరీష్ గత కొంతకాలంగా ఎందుకో గాని సైలెంట్ గా ఉంటున్నాడు. శిరీష్ సైలెన్సు వెనక చాలా కారణాలే ఉన్నాయన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అసలు మనోడు హైదరాబాదులోనే ఉండటం లేదట. ముంబైని అడ్డాగా చేసుకుని అక్కడే ఉంటున్నాడని… ప్రస్తుతం అతడు చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ప్రేమ కాదంట. అను ఇమ్మానుయేల్ హీరోయిన్.. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అసలు ఈ సినిమా ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదు. ఇక అల్లు అరవింద్ తాను ఏ పని చేపట్టిన చాలా సక్సెస్ చేస్తారు. అలాంటి పెద్ద కొడుకుని స్టార్ హీరోను చేయడంలో సక్సెస్ అయ్యి… రెండో కొడుకును కనీసం టైర్ 2 రేంజ్ హీరోగా కూడా నిలబెట్టలేకపోయారు.
ఇక తాజా గాసిప్ ప్రకారం శిరీష్ తండ్రి అరవింద్ మీద అలిగాడని టాక్ ? అందుకే హైదరాబాద్ వదిలేసి ముంబైలో ఉంటున్నాడట. తన తండ్రి అరవింద్ తన కెరీర్ విషయంలో పెద్దగా ఫోకస్ చేయడం లేదని.. అన్న బన్నీ కెరీర్‌ను ఓ రేంజ్లో తీర్చిదిద్దిన తండ్రి.. తన విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే శిరీష్ ముంబైలోనే ఒంటరిగా ఉంటున్నాడని అంటున్నారు. నిజానికి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా శిరీష్ తండ్రితో ఆ ఇంట్లో కాకుండా ఒంటరిగానే ఉండేవాడు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు.
ఇక అన్న బన్నీ సోషల్ మీడియా వ్యవహారాలు అన్ని చూసుకునే శిరీష్ ఇప్పుడు వాటిని కూడా వదిలేశాడనే అంటున్నారు. మొత్తానికి ఈ పుకార్లు భరించే రకం అయితే శిరీష్ కాదు. మరి వీటిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో ? అసలేం జరుగుతుందో ? చూడాలి.