Moviesతమన్నాకి ఇప్పటి వరకు ఎన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయో తెలుసా...!

తమన్నాకి ఇప్పటి వరకు ఎన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయో తెలుసా…!

మూడుప‌దులు దాటినా చెక్కుచెదరని అందంతో కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టిస్తున్న హీరోయిన్ తమన్నా. సీనియర్ హీరోయిన్ తమన్నా ఇప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ఈ మిల్కీ బ్యూటీ ఈ కేవలం సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్‌ల‌లో సైతం నటిస్తూ యువ హీరోయిన్లకు పోటీఇస్తుంది. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలతోనే తెర మరుగవుతుంటే అవుతుంటే దాదాపుగా దశాబ్దం దాటినా కూడా తమన్నా తనకి ఇంకా తిరుగు లేదని నిరూపిస్తోంది.

 

ఓవైపు సీనియర్ హీరోలతో నటిస్తూనే మరోవైపు జూనియర్లతో సైతం జోడి కట్టి తన సత్తా చాటుతోంది. ఇక తాజాగా F3 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. సినిమా జీవితంలో ఇప్పటికే అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్స్ అందరితోనూ జోడి కట్టింది. కానీ సినిమా జీవితం కాసేపు పక్కన పెడితే ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయ్. జీవితంలో ప్రేమ అనే అంశం తమన్నాకు నాకు చేదు సంఘటనలు గానే మిగిలిపోయింద‌ట‌.

ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటికే పలుమార్లు ప్రేమలో పడటం, అది విఫలం కావడం కూడా జరిగింది. తమన్నా మొదటి సారి ప్రేమలో పడింది స్కూల్లో చదువుకునే రోజుల్లో. తనతో చదువుకునే తనతోటి స్టూడెంట్ ని ఎంతో ప్రేమించిందట. అతడికి ప్రపోజ్ చేయాలని గంపెడు ఆశలతో వెళ్లి తన ప్రేమను తెలియజేస్తే అతడు మాత్రం సిస్టర్ అంటూ ఆమెను నిరాశపరిచాడట దాంతో గుండె బద్దలైపోయినంత బాధ పడిందట తమన్నా. ఈ విషయం ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

 

ఇక ప్రేమ దోమ లాంటి జోలికి పోకూడదని సినిమాల్లో బిజీ అయిపోయింది తమన్నా. అలా సినిమాలో నటిస్తున్న క్రమంలో తన తోటి నటుడైన కార్తీతో మరోమారు ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి ఆవారా సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రేమలో పడ్డారు. కానీ కార్తీ చివరికి తన తండ్రి చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోగా… తమన్నా మాత్రం సింగిల్ గా మిగిలిపోయింది. ఇక కార్తీక్ బ్రేకప్ నుంచి కోలుకోక ముందే మరోమారు ప్రేమలో పడింది తమన్నా.

తనతోపాటు ఒక వాణిజ్య ప్రకటనలో నటించిన భార‌త స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీతో చెట్టపట్టలేసుకొని తిరుగుతూ మీడియా కంట పడింది. కొన్నాళ్లపాటు వీరి వ్యవహారం బాగానే సాగినా అనుష్క శర్మ ఎంట్రీ తో మళ్ళీ తమన్నా వ్యవహారం మొదటికే వచ్చింది. ఆమె డేటింగ్ కాస్త ప్రేమగా మారకముందే బ్రేకప్ పడింది. ఇలా తన తోటి స్టూడెంట్స్ తో ఓసారి, సినిమా హీరోతో మరోసారి, చివరగా ఓ క్రికెటర్ తో ప్రేమాయణం సాగించిన తమన్నా వారు పెళ్లి చేసుకుని సెటిల్ అయినా కూడా స్టిల్స్ సింగిల్ గానే ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news