తెలుగు సీనియర్ హీరోయిన్ రంభ నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె పేరును రంభగా మార్చేశారు. సినిమాల్లోకి వచ్చిన వెంటనే సూపర్ హిట్ అందుకోవడంతోపాటు తన నటనతో ప్రూవ్ చేసుకుంది. దీంతో తక్కువ సమయంలోనే రంభ తెలుగులో స్టార్ హీరోలైన చిరంజీవి – నాగార్జున – బాలకృష్ణ – వెంకటేష్ లాంటి హీరోలతో నటించి సూపర్ హిట్లు కొట్టింది.
దాదాపు 7 – 8 సంవత్సరాల పాటు రంభ తెలుగు సినిమాను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. అదే సమయంలో రంభకు అటు తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్లు కొట్టింది. ఆ తర్వాత రంభ భోజపురి భాషలోకి ఎంట్రీ ఇచ్చింది. భోజపురి భాషలో రంభ ఒక వెలుగు వెలిగింది. మనోజ్ తివారి – రంభ కాంబినేషన్ ఉంటే అప్పట్లో ఎంతో క్రేజీ ఉండేది. భోజపురి సినీ ప్రేక్షకులు రంభను ఒక దేవతల ఆరాధించారు.
సినిమాలకు దూరమయ్యాక రంభ కెనడాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను ప్రేమించి 2010లో పెళ్లి చేసుకుంది. చాలా ఏళ్లపాటు ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. రంభ – ఇంద్ర కుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఈ దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో వీరు పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. రంభ తన భర్త ఇంద్ర కుమార్‌కు విడాకులు ఇచ్చేస్తానని పంతానికి పోయింది.
తనకు నెలకు భరణంగా ఐదు లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలని కూడా రంభ తన పిటీషన్ లో పేర్కొంది. విడాకులకు దరఖాస్తు చేశాక రంభ పిల్లల పోషణ భారం కావడంతో మళ్లీ తనకు ఎక్కువ భరణం కావాలని కూడా కోరింది. అయితే అదే సమయంలో రంభతో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావు ఆమెతో మాట్లాడి భార్యాభర్తల మధ్య గొడవను పరిష్కరించేందుకు తన వంతుగా సాయం చేశారన్న టాక్ అప్పట్లో వినిపించింది.
భర్తకు దూరమైతే జీవితంలో ఎలాంటి ? సమస్యలు వస్తాయో చెప్పడంతో పాటు ముగ్గురు పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంటుందని… చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని రాఘవేంద్రరావు చేసిన సూచనలతో రంభ తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుంది. అలా తిరిగి ఆమె కెనడా వెళ్లి ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక రంభ ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.