బెంగుళూరు భామ నందిత శ్వేత అందం, అభినయంలో ఆకట్టుకున్నా కెరీర్ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కన్నడ సినిమా నంద లవ్స్ నందితతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నందిత. ఆ తర్వాత తమిళ సినిమా అట్టకత్తితో కోలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాలతోనే ఆమె కన్నడ, తమిళ యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇలా కన్నడ సినిమా, తమిళ సినిమాలతో హీరోయిన్‌గా నటించిన ఈ బొద్దుగుమ్మ తెలుగులో ఎక్కడి పోతావు చిన్నవాడా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా బాగానే పేరు తెచ్చుకుంది.
అయితే, ఈ సినిమా లవ్ స్టోరి కాకపోవడం ఓ మైనస్. అలాగే, ఇందులో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించాడు. ఆ సమయంలో అంత క్రేజ్ ఉన్న స్టార్ హీరో కాకపోవడంతో తెలుగులో ఎంట్రీ అంత గొప్పగా లేకపోయింది. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2 సినిమాలలో నటించింది. అయితే, ఇందులో మెయిన్ హీరోయిన్ కాకపోవడంతో నందితను కనీసం పెద్ద హీరో సినిమాలో సెకండ్ లీడ్ కోసం కూడా తీసుకోలేకపోయారు. యంగ్ హీరోలతో ఒక్క హిట్ సినిమా పడినా నందిత ఫేట్ మారిపోయేదేమో.
కానీ, నందిత కెరీర్ ప్రారంభంలోనే చేసిన ఎక్కడికిపోతావు చిన్నవాడా అన్ని రకాలుగా మైనస్ అయింది. సాధారణంగా కొందరికి సౌత్ భాషలలో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటే ఇక్కడ కళ్ళకి అద్దుకొని అవకాశాలిస్తారు. కానీ, నందితకి తమిళ, కన్నడ సినిమాలలో చేయడానికి చాలా సినిమాలు చేసినప్పటికీ అవేవీ అమ్మడికి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టలేదు. ఇలా నందితకి కలిసొచ్చినట్టే అనిపించినా కూడా ఏ సినిమా తనని ఓ మెట్టు పైకెక్కించలేకపోయాయి.
దాంతో ఈ హీరోయిన్‌ని తీసి పక్కన పెట్టారు. సడన్‌గా నందిత శ్వేత అంటే గుర్తు పట్టని వారూ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. అందుకే సినిమాలు కాకుండా బుల్లితెరమీద డాన్స్ షోలో ఓ జడ్జ్‌గా సందడి చేస్తుంది. చెప్పాలంటే ఆ షోకి నందిత స్పెషల్ అట్రాక్షన్‌గానే ఉంది. కాస్త అల్ట్రా మోడ్రన్ డ్రస్సులలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కనీసం ఏదో ఒక వార్తలో నిలుస్తుంది. ఇప్పుడు నందితకు చెప్పుకోవడానికి ఇదే ఉంది. ఇంతకంటే దారుణంగా తెరమరుగైన వారూ లేకపోలేదు. వారితో పోల్చుకుంటే నందిత కాస్త నయం అనుకోవాలి.